కాలుష్య రాజధాని న్యూఢిల్లీ!
భారత రాజధానికి మరో గుర్తింపు లభించింది. ఇది నెగెటివ్ కోణంలో కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని ప్రపంచ బ్యాంకు తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 381 అత్యంత వాయు కాలుష్య నగరాల జాబితాను ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసింది. దేశరాజధానిలో గాలిలో అత్యంత ప్రమాదకరస్థాయిలో కాలుష్యకారకాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. బీజింగ్ నగరం కంటే ఢిల్లీలో మూడు రెట్ల వాయు కాలుష్యం పేరుకుపోయిందని నివేదికలో వెల్లడించింది. 2.5 మైక్రాన్లు లేదా […]
BY sarvi26 Sept 2015 4:10 AM IST
X
sarvi Updated On: 26 Sept 2015 9:36 AM IST
భారత రాజధానికి మరో గుర్తింపు లభించింది. ఇది నెగెటివ్ కోణంలో కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని ప్రపంచ బ్యాంకు తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 381 అత్యంత వాయు కాలుష్య నగరాల జాబితాను ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసింది. దేశరాజధానిలో గాలిలో అత్యంత ప్రమాదకరస్థాయిలో కాలుష్యకారకాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. బీజింగ్ నగరం కంటే ఢిల్లీలో మూడు రెట్ల వాయు కాలుష్యం పేరుకుపోయిందని నివేదికలో వెల్లడించింది. 2.5 మైక్రాన్లు లేదా 2.5 పీఎం వ్యాసార్థంతో ఎక్కువ సాంద్రత కలిగిన దుమ్ము, ధూళి కణాలు గాలిలో ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఈ పరిమాణం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం కంటే 15 రెట్లు అధికం. ఈ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం వల్ల నగర జీవులు ఆస్థమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస, గుండె జబ్బులకు గురవుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు సొంత వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ కాలుష్య ఉద్గారాలు అధికంగా విడుదలవుతున్నాయని తెలిపింది. రాజధాని పక్కన ఉన్న పారిశ్రామిక వాడలు కాలుష్య ముప్పును రెట్టింపు చేస్తున్నాయని తెలిపింది. పలు కార్పొరేట్ కార్యాయాలు, ధనికులు అధికంగా ఉన్ననగరంలో ఏసీల వినియోగం కూడా ప్రమాదకర ఉద్గారాలు గాలిలోకి వెలువడేందుకు దోహదం చేస్తుందని సర్వే వివరించింది.
Next Story