రాహుల్ దారితప్పిన పిల్లాడు
‘రాహుల్ గాంధీ.. రాజకీయాల్లో ‘దారితప్పిన పిల్లాడు’ అని ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని భాజపా అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ విమర్శించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు అని అక్బర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారత రాజకీయాల్లో దారి తప్పిన పిల్లాడు, అతనికి వాస్తవాలు తెలియవు. అనుభవం లేదు.. అయినా ప్రతిరోజూ అతన్ని నాయకుడిగా […]
BY sarvi26 Sept 2015 7:25 AM IST
X
sarvi Updated On: 26 Sept 2015 7:51 AM IST
‘రాహుల్ గాంధీ.. రాజకీయాల్లో ‘దారితప్పిన పిల్లాడు’ అని ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని భాజపా అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ విమర్శించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు అని అక్బర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారత రాజకీయాల్లో దారి తప్పిన పిల్లాడు, అతనికి వాస్తవాలు తెలియవు. అనుభవం లేదు.. అయినా ప్రతిరోజూ అతన్ని నాయకుడిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రాహుల్ విదేశీ పర్యటనల విషయంలోనూ వాస్తవాలు దాచిపెడుతోందని విమర్శించారు. భారతీయులు ఏం చెప్పినా విశ్వసిస్తారని, ఇక్కడివారికి ఇంటర్నెట్ అందుబాటులో లేదని, ఎలాంటి సమాచారం తెలుసుకోలేరన్న మూర్ఖపు ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బతుకుతున్నారని ఎగతాళి చేశారు. ఇక రిజర్వేషన్ల విషయంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని బీహార్ సీఎం నితీశ్, ఆర్జేడీ అధినేత లాలూ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు.
Also Read: సీనియర్లకు సెలవు సంస్కృతి బీజేపీదే!
Next Story