Telugu Global
Others

టీఆర్‌ఎస్‌కు గ్రేటర్‌ ఎన్నికల భయం: కిషన్‌రెడ్డి

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో గుబులు పెరుగుతుందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే పార్టీపై వ్యతిరేకత వస్తుందని భయపడుతూ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి ఓట్ల తొలగింపును అస్త్రంగా మార్చుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఓట్ల తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టారని, దీనికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తన వంతు సహకారం అందిస్తున్నారని […]

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో గుబులు పెరుగుతుందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే పార్టీపై వ్యతిరేకత వస్తుందని భయపడుతూ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. అందుకే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి ఓట్ల తొలగింపును అస్త్రంగా మార్చుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఓట్ల తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టారని, దీనికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ తన వంతు సహకారం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌ తప్పుపట్టినా సోమేష్‌కుమార్‌ తన పద్ధతి మార్చుకోవడంలేదని, ఆయన్ని ఆంధ్రకి కేటాయించినా అధికారపార్టీ అండదండలతో పదవిలో కూర్చుని సీటు వదలడం లేదని విమర్శించారు. ప్రజల నుంచి విమర్శలు వస్తుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సిబ్బంది అధికార పార్టీ తొత్తులుగా మారకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. సనత్‌నగర్‌లోనూ అక్రమంగా ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నాయకులు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఎంఐఎంకు తొత్తుగా మారి ఎన్నికలు వారికి అనుకూలంగా ఉండేట్టు చూస్తున్నారని, డివిజన్ల విభజన ప్రక్రియను కూడా అందుకే నిలిపి వేశారని ఆయన ఆరోపించారు.

First Published:  25 Sept 2015 1:10 PM GMT
Next Story