యెమెన్ మసీదులో ఆత్మాహుతిదాడి
షియా ముస్లింలు లక్ష్యంగా యెమెన్‌లో జరిగిన బాంబు దాడిలో 25 మంది మృతి చెందగా.. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. హుతి షియా తిరుగుబాటుదారుల నియంత్రణలోనున్న సనా పట్టణంలో ప్రార్థనలు చేసేందుకు షియా ముస్లింలు పెద్ద ఎత్తున బలిలి మసీద్‌కు చేరుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్ట్ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదు లోపలికి వెళ్లి.. ప్రార్థన జరుగుతుండగా, తనను తాను పేల్చుకున్నాడు. దీంతో 25 మంది మృతి చెందారని, 100 మంది వరకు గాయపడ్డారని […]
BY sarvi24 Sept 2015 3:02 PM GMT
sarvi Updated On: 25 Sept 2015 3:08 AM GMT
షియా ముస్లింలు లక్ష్యంగా యెమెన్‌లో జరిగిన బాంబు దాడిలో 25 మంది మృతి చెందగా.. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. హుతి షియా తిరుగుబాటుదారుల నియంత్రణలోనున్న సనా పట్టణంలో ప్రార్థనలు చేసేందుకు షియా ముస్లింలు పెద్ద ఎత్తున బలిలి మసీద్‌కు చేరుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్ట్ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదు లోపలికి వెళ్లి.. ప్రార్థన జరుగుతుండగా, తనను తాను పేల్చుకున్నాడు. దీంతో 25 మంది మృతి చెందారని, 100 మంది వరకు గాయపడ్డారని వైద్యులు ప్రకటించారు.
Next Story