కంచె తగ్గింది శివం ముందుకొచ్చింది
కంచె సినిమా పోస్ట్ పోన్ అయిన విషయాన్ని ఆ టీం అధికారికంగా చెప్పనప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కంచె విడుదల వాయిదా అనే విషయం స్పష్టమైపోతోంది. ఎందుకంటే.. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ స్టార్టవ్వలేదు. తాజాగా ఓసారి ప్రచారం ప్రారంభించి ఆపేశారు కూడా. మరీ ముఖ్యంగా కంచె సినిమా ఇంకా సెన్సార్ పూర్తిచేసుకోలేదు. ఈ గ్యాప్ లో రామ్ హీరోగా నటించిన శివం సినిమా సెన్సార్ మాత్రం కంప్లీట్ అయింది. ఈ సినిమాకు u/a […]
BY sarvi25 Sept 2015 12:33 AM IST
X
sarvi Updated On: 25 Sept 2015 3:39 AM IST
కంచె సినిమా పోస్ట్ పోన్ అయిన విషయాన్ని ఆ టీం అధికారికంగా చెప్పనప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కంచె విడుదల వాయిదా అనే విషయం స్పష్టమైపోతోంది. ఎందుకంటే.. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ స్టార్టవ్వలేదు. తాజాగా ఓసారి ప్రచారం ప్రారంభించి ఆపేశారు కూడా. మరీ ముఖ్యంగా కంచె సినిమా ఇంకా సెన్సార్ పూర్తిచేసుకోలేదు. ఈ గ్యాప్ లో రామ్ హీరోగా నటించిన శివం సినిమా సెన్సార్ మాత్రం కంప్లీట్ అయింది. ఈ సినిమాకు u/a సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్‌బోర్డు. దీంతో శివం విడుదలకు లైన్ క్లియర్ అయింది కంచె ప్లేసులో అక్టోబర్ 2న శివం సినిమా రాబోతోంది. కొత్త కుర్రాడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన శివంలో రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని 3 పాటలు ఆడియో ఫంక్షన్ రోజునే ఇనిస్టెంట్ గా హిట్టయ్యాయి. దీంతో శివం సినిమాపై అంచనాలు పెరిగాయి. పండగ చేస్కో సక్సెస్ తర్వాత వస్తున్న శివంతో మరోసారి హిట్ అందుకోవాలనుకుంటున్నాడు రామ్.
Next Story