చంద్రబాబుతో లగడపాటి రాజకీయం!
రాష్ట్ర విభజన తర్వాత చెప్పినట్టే రాజకీయ సన్యాసం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ మాజీ పార్లమెంట్‌సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయన గురువారం అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. లగడపాటి రాజకీయ సన్యాసాన్ని కొండెక్కించి మళ్ళీ రాజకీయ సంసారంలోకి దిగుతారా అనే ప్రశ్న అప్పుడే మొదలయ్యింది. మమూలుగా ఆయన ఏమాటన్నా దానికి కట్టుబడడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం లగడపాటి వ్యాపారానికే పరిమితమై పోయి మిగిలిన విషయాల్ని పట్టించుకోవడం మానేశారు. […]
BY sarvi25 Sept 2015 7:02 AM IST
X
sarvi Updated On: 26 Sept 2015 8:21 AM IST
రాష్ట్ర విభజన తర్వాత చెప్పినట్టే రాజకీయ సన్యాసం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ మాజీ పార్లమెంట్‌సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయన గురువారం అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. లగడపాటి రాజకీయ సన్యాసాన్ని కొండెక్కించి మళ్ళీ రాజకీయ సంసారంలోకి దిగుతారా అనే ప్రశ్న అప్పుడే మొదలయ్యింది. మమూలుగా ఆయన ఏమాటన్నా దానికి కట్టుబడడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం లగడపాటి వ్యాపారానికే పరిమితమై పోయి మిగిలిన విషయాల్ని పట్టించుకోవడం మానేశారు. కాలం కలిసి రానప్పుడు అందరూ చేసే పనినే ఆయనా చేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో లగడపాటి ఆయనతో జరిపిన రహస్య భేటీ రాజకీయ పునఃప్రవేశంపై చర్చలకు తెరతీసినట్టు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాజధాని నిర్మాణం వంటి పనులపై చర్చించినట్లుగా లగడపాటి తన సన్నిహితులకు చెబుతున్నా ఆయన మళ్లీ రాజకీయ చక్రం తిప్పేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్ధికంగా బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న లగడపాటి కొత్తగా ఇపుడు చంద్రబాబు పార్టీలో చేరి తనదైన ముద్రను చూపించాలని తహతహలాడుతున్నట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే సుజనా చౌదరికి చెక్ పెట్టేందుకు చంద్రబాబుకు లగడపాటి ఉపయోగపడతారని విశ్వసనీయవర్గాల సమాచారం.
Next Story