Telugu Global
National

హార్దిక్ ప‌టేల్‌పై గుజ‌రాత్ హైకోర్టు ఆగ్ర‌హం!

ప‌టేళ్ల‌కు ఓబీసీ హోదా కావాలంటూ ఉద్య‌మిస్తున్న హ‌ర్ధిక్ ప‌టేల్‌పై గుజ‌రాత్ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క్ష‌మించేది లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ప‌టేల్ త‌ర‌ఫు న్యాయ‌వాది మంగుకియానూ హెచ్చ‌రించ‌డం విశేషం. బుధ‌వారం సాయంత్రం త‌న‌ను ఓ సాయుధుడు నిర్బంధించాడ‌ని, అత‌ను చూడ‌టానికి పోలీసులానే ఉన్నాడంటూ హ‌ర్దిక్ ప‌టేల్ ఆరోపించిన విష‌యం తెలిసిందే! త‌రువాత హ‌ర్దిక్ ఆచూకీని తెల‌పాలంటూ అత‌ని అనుచ‌రులు దినేశ్‌పటేల్, కేతన్ పటేల్‌లు దాఖలు చేసిన హేబియస్ […]

హార్దిక్ ప‌టేల్‌పై గుజ‌రాత్ హైకోర్టు ఆగ్ర‌హం!
X
ప‌టేళ్ల‌కు ఓబీసీ హోదా కావాలంటూ ఉద్య‌మిస్తున్న హ‌ర్ధిక్ ప‌టేల్‌పై గుజ‌రాత్ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క్ష‌మించేది లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ప‌టేల్ త‌ర‌ఫు న్యాయ‌వాది మంగుకియానూ హెచ్చ‌రించ‌డం విశేషం. బుధ‌వారం సాయంత్రం త‌న‌ను ఓ సాయుధుడు నిర్బంధించాడ‌ని, అత‌ను చూడ‌టానికి పోలీసులానే ఉన్నాడంటూ హ‌ర్దిక్ ప‌టేల్ ఆరోపించిన విష‌యం తెలిసిందే! త‌రువాత హ‌ర్దిక్ ఆచూకీని తెల‌పాలంటూ అత‌ని అనుచ‌రులు దినేశ్‌పటేల్, కేతన్ పటేల్‌లు దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కేజే థాకర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా హ‌ర్దిక్ ప‌టేల్ ఆయ‌న ఆరోప‌ణ‌ల‌కు స‌రైన సాక్ష్యాలు చూపించ‌క‌పోవ‌డంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తే.. ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఆరావళీ జిల్లాలోని జరిగిన సభలో హార్దిక్ పటేల్ దేశాన్నే ఎదిరించేలా మాట్లాడారని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, హార్దిక్ తప్పుడు ఆరోపణలు చేశారా? లేదా అన్నదానిపై ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయం వెల్ల్లడించలేమని, ఒకవేళ పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయదలిస్తే చట్టప్రకారం వెళ్లవచ్చని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. కులంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఆనందీబెన్‌పటేల్ ప్రకటించారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉద్యోగాల్లో వయోపరిమితి సడలింపులుంటాయని తెలిపారు.
First Published:  25 Sept 2015 2:30 AM IST
Next Story