చంద్రబాబు నాయకుడు కాదు... ఓన్లీ ఫాలోయర్
ఒకప్పుడు చంద్రబాబంటే ట్రెండ్ సెట్టర్ అనుకునేవారు. కాని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఆయన ట్రెండ్ సెట్టర్ కాదు… జస్ట్ ఫాలోవర్ అని. చంద్రబాబును నిశితంగా గమనించేవారికి అర్ధమయ్యే ఏకైక అంశం ఏమిటంటే… ఆయన జనం మెచ్చుకునే విషయాల్ని యధావిధిగా ఫాలో అయిపోతారని. 2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేసి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని వారి మనసు గెలుచుకున్నారు. ఆనాడు రాజన్న చేసిన పాదయాత్ర మరచిపోలేని అద్భుతం. 2009 నడక […]
BY sarvi25 Sept 2015 3:35 PM IST
X
sarvi Updated On: 4 Oct 2015 5:03 AM IST
ఒకప్పుడు చంద్రబాబంటే ట్రెండ్ సెట్టర్ అనుకునేవారు. కాని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఆయన ట్రెండ్ సెట్టర్ కాదు… జస్ట్ ఫాలోవర్ అని. చంద్రబాబును నిశితంగా గమనించేవారికి అర్ధమయ్యే ఏకైక అంశం ఏమిటంటే… ఆయన జనం మెచ్చుకునే విషయాల్ని యధావిధిగా ఫాలో అయిపోతారని. 2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేసి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని వారి మనసు గెలుచుకున్నారు. ఆనాడు రాజన్న చేసిన పాదయాత్ర మరచిపోలేని అద్భుతం. 2009 నడక సాధ్యం కాదనుకుని బస్ యాత్ర ద్వారా జనామోదం సంపాదించాలని చంద్రబాబు భావించి అనుసరించారు. కాని జనం నడకకు-బస్‌కు ఉన్న తేడాను అర్ధం చేసుకున్నారు. మళ్ళీ వై.ఎస్.కే పట్టం కట్టారు. ఇక తప్పదనుకున్న చంద్రబాబు రాజన్న చేసిన పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు దాన్నే ఫాలో అయ్యారు. ఆ పాదయాత్రలో కూడా తనదైన ముద్ర కోసం ప్రయత్నించి ఓ నాలుగడుగులు ఎక్కువ నడిచి రికార్డు సృష్టించినట్టు ప్రచారం చేయించారు. వైఎస్ లేకపోవడం… మోడీ, పవన్‌కల్యాణ్ ప్రభంజనం వెన్నంటి ఉండడంతో చంద్రబాబుకే జనం పట్టం కట్టారు. ఇలా అధికారంలోకొచ్చిన చంద్రబాబు… రాజన్నలా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయకుండా …తన కోటరి, తన పరిజనం సంక్షేమం, సంపద కోసం పనిచేస్తున్నాడని ప్రజలకు అర్దమయ్యింది.
ఎన్నికల తర్వాత కూడా ఆయన ట్రెండ్ ఫాలోవర్‌గా ఉండడం మానలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ఫాలో అవుతూ కనిపిస్తున్నారు. ఆయన జీతాలు పెంచితే చంద్రబాబు పెంచుతారు. ఆయన ఎలా వెళితే అలాగే ఈయనా ముందుకెళతారు. చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్‌పై కన్నా హైదరాబాద్ మీదే మోజు ఎక్కువ కనపడుతోంది. బహుశా ఆయనకు ఆస్తులన్నీ అక్కడే ఎక్కువగా ఉండడం వల్ల కావొచ్చు. తాను ఏపీ రాజధాని నుంచే పాలిస్తానని చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్‌లో మళ్ళీ ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారో తెలీదు. ఇంటి ప్లాన్ సరిగా లేదని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించినప్పుడైనా ఆయన ఆ ప్రతిపాదన నుంచి వైదొలగవలసింది. కాని ఆయనకు హైదరాబాద్ మీద ఉన్న మమకారం అక్కడ ఇల్లు కట్టడం ద్వారా మరోసారి రుజువు చేసుకున్నారు. ఇపుడు ఆయన ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 60 కోట్లతో రోడ్దేశారు. విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఐదు కోట్లు, విద్యుత్ లైన్లకు ఐదు కోట్లు, గెస్ట్‌హౌస్ ఆధునీకరణకు 20 కోట్లు… ఇదంతా ప్రజల డబ్బు. వందకోట్లు ఖర్చు పెట్టే బదులు ఏపీ రాజధాని నగరంలో ఇల్లు కట్టుకోవచ్చు కదా? తాను ఇల్లు కట్టుకుంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. గెస్ట్ హౌసయితే ప్రజల డబ్బు వాడుకోవచ్చు.
చంద్రబాబు అధికారంలోకొచ్చి 16 నెలలు గడిచినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించడం మానేసి… తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చేస్తుంటే దాన్నే ఫాలో అవడానికి చూస్తున్నారు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతాల విషయంలోగాని, జిల్లాల సంఖ్యను పెంచడంలోగాని కెసిఆర్ ఏం చేస్తుంటే… చంద్రబాబు అదే పని చేస్తున్నాడు. ఈ విధానం మంచిది కాదు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణా రాష్ట్రానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణా రాష్ట్రానికి మంచి రాజధాని నగరం ఉంది… మిగులు బడ్జెటు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే రాజధాని లేక… లోటు బడ్జెటుతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోంది. విజన్ కలిగిన నాయకుడినని పూటకొకసారి చెప్పే చంద్రబాబు… రాష్ట్రానికి ఉన్న నిధులన్నీ అధికార నివాసాల కోసం, భద్రత కోసం వెచ్చిస్తూ ఖజానాను ఖాళీ చేస్తున్నారు. నిజానికి ఆయన విచ్చలవిడిగా చేస్తున్న దేశ, విదేశీ పర్యటనల ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని చక్కబెట్టే తీరు ఇదేనా అన్నది ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశ్న. జవాబు చంద్రబాబు దగ్గర ఉందో లేదో తెలీదు.
– సవరం నాని
Next Story