బ్రూస్‌లీ టీం నమ్మించి మోసం!
రామ్‌చరణ్ కొత్త సినిమా బ్రూస్లీ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెబుతూ అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది సదరు సినిమా టీం. పాట రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఫేస్‌బుక్, ట్విట్టర్ వాల్స్‌పై ప్రకటన ప్రదర్శించారు. మరో మూడు గంటలు ఉందనగా… మరో రెండు గంటల్లో.. మరో గంటలో అంటూ అభిమానుల్లో ఉత్కంఠ పెంచారు. చివరికి సాంగ్ అర్థరాత్రి 12 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. తీరా 12 గంటలు కాగానే సారీ గయ్స్ మరో 40 నిమిషాలు…ప్లీజ్… […]
BY admin25 Sept 2015 4:37 PM IST
X
admin Updated On: 25 Sept 2015 5:29 PM IST
రామ్‌చరణ్ కొత్త సినిమా బ్రూస్లీ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెబుతూ అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది సదరు సినిమా టీం. పాట రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఫేస్‌బుక్, ట్విట్టర్ వాల్స్‌పై ప్రకటన ప్రదర్శించారు. మరో మూడు గంటలు ఉందనగా… మరో రెండు గంటల్లో.. మరో గంటలో అంటూ అభిమానుల్లో ఉత్కంఠ పెంచారు. చివరికి సాంగ్ అర్థరాత్రి 12 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. తీరా 12 గంటలు కాగానే సారీ గయ్స్ మరో 40 నిమిషాలు…ప్లీజ్… అంటూ మరో రిక్వెస్టు పెట్టారు. దీంతో సాంగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో నిరాశ… కొంత మందిలో కోపం… సార్ తొందరగా రిలీజ్ చేయండని కొందరు, అభిమానుల సహనాన్ని పరీక్షించొద్దని మరికొందరు.. పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ మానాలని ఇంకొందరు… ఇలా తలాఒక కామెంట్ పెడుతూ తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అభిప్రాయాన్ని వెళ్ళగక్కారు. 40 నిమిషాల తరువాత కూడా సాంగ్ రిలీజ్ కాలేదు. చెర్రి అభిమానులకు చిర్రెత్తి ఎఫ్‌బీ, ట్విట్టర్‌లను స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తీరిగ్గా ఎప్పుడో సాంగ్‌ని విడుదల చేసి మమ అనిపించారు. అయితే ఈ సాంగ్‌ను ఇప్పటివరకు ఐదున్నర లక్షల మంది విన్నారంటే అభిమానులు నిరీక్షణలో ఎంత బాధ పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.
Next Story