పాటిదర్లకు గుజరాత్ నజరానాలు!
పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కులంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపులుంటాయని తెలిపారు. ఇంతేకాకుండా పాటిదర్ల కమ్యూనిటీకి వెయ్యి కోట్ల ప్రత్యేక భారీ ప్యాకేజీని ప్రకటించారు. పాటిదర్ కమ్మూనిటీకి చెందిన యువకులకు విద్యనభ్యసించేందుకు, ఇతర సౌకర్యాల కల్పన కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు సీఎం ఆనందీబెన్ […]
BY sarvi25 Sept 2015 1:49 AM GMT
X
sarvi Updated On: 25 Sept 2015 2:04 AM GMT
పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కులంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపులుంటాయని తెలిపారు. ఇంతేకాకుండా పాటిదర్ల కమ్యూనిటీకి వెయ్యి కోట్ల ప్రత్యేక భారీ ప్యాకేజీని ప్రకటించారు. పాటిదర్ కమ్మూనిటీకి చెందిన యువకులకు విద్యనభ్యసించేందుకు, ఇతర సౌకర్యాల కల్పన కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు సీఎం ఆనందీబెన్ పాటిల్ తెలిపారు. మరోవైపు పాటిదర్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్ధిక్ పటేల్ మాత్రం ఈ ప్యాకేజీని తోసిపుచ్చారు. ప్రభుత్వం తమ కమ్యూనిటీకి ప్రకటించిన ఈ ప్యాకేజీ ఓ లాలీపాప్ లాంటిదని ఆయన అభివర్ణించారు.
Next Story