ఢిల్లీ సెక్స్ వర్కర్లకు 4 లక్షల కండోంలు ఉచిత సరఫరా
కొన్నాళ్ళ కిందట ఒక పెద్దాయనకు మరో సామాన్యునికి మధ్యన ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. అయ్యా! నగరం మధ్యలో ఈ వేశ్యావాటికలు ఎందుకు? అని. అందుకు ఆయన మురుగు నీరు పోవడానికి కాలువలు ఉన్నట్లే వేశ్యా వాటికలు కూడా అవసరం అన్నాడట. అదే విధంగా మహా నగరాలలో వేశ్యావాటికలు వృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వేశ్యల సంక్షేమానికి పాటుపడుతున్నాయి. దేశ రాజధాని డిల్లీ జి.బి. రోడ్డులో వున్న వేశ్యావాటికలో ఉచిత పంపిణి కోసం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ […]
కొన్నాళ్ళ కిందట ఒక పెద్దాయనకు మరో సామాన్యునికి మధ్యన ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. అయ్యా! నగరం మధ్యలో ఈ వేశ్యావాటికలు ఎందుకు? అని. అందుకు ఆయన మురుగు నీరు పోవడానికి కాలువలు ఉన్నట్లే వేశ్యా వాటికలు కూడా అవసరం అన్నాడట. అదే విధంగా మహా నగరాలలో వేశ్యావాటికలు వృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వేశ్యల సంక్షేమానికి పాటుపడుతున్నాయి.
దేశ రాజధాని డిల్లీ జి.బి. రోడ్డులో వున్న వేశ్యావాటికలో ఉచిత పంపిణి కోసం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో) కండోంలను సరఫరా చేస్తుంది. డిల్లి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలికి నాకో నుంచి ప్రతి నెల 12 లక్షల కండోంలు అందాలి. గత మే నెల నుంచి సరఫరాలు లేవు. నాకో నుంచి సరఫరా అందని కారణంగా డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంపిణి చేయాలని తలపెట్టింది. దాదాపు 4 లక్షల కండోంలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాలని , లేనట్లయితే టెండర్లు పిలవాలని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదేశాలు జారీచేశారు. జి.బి. రోడ్డులో దాదాపు 5 వేల మంది సెక్స్ వర్కర్లు వుంటారు. వారిలో దాదాపు 35 మందికి ఎయిడ్స్ వ్యాధి వున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరిస్థితిలో డిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిల్లీ జి.బి. రోడ్డులోని సెక్స్ వర్కర్లకు ప్రతినెల ఆరు లక్షల కండోంలు అవసరమవుతాయి.