Telugu Global
Others

Wonder World 36

అంతరిక్షంలో తొలి స్మార్ట్‌ ఫోన్‌! అంతరిక్షంలోకి అనేక ఉపగ్రహాలను పంపిస్తున్న భారత్‌ ఈ సారి ఓ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పంపించింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అనేక అప్లికేషన్లు లోడ్‌ చేశారు. అందులో కొన్ని అప్లికేషన్లు ప్రయోగాత్మకంగా పరిశీలించడం కోసం లోడ్‌ చేసినవి కాగా మరి కొన్ని కేవలం ఫన్‌ కోసం లోడ్‌ చేసినవి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం అంతరిక్షంలో భూ స్థిర కక్ష్యలోనే […]

Wonder World 36
X

అంతరిక్షంలో తొలి స్మార్ట్‌ ఫోన్‌!

అంతరిక్షంలోకి అనేక ఉపగ్రహాలను పంపిస్తున్న భారత్‌ ఈ సారి ఓ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పంపించింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అనేక అప్లికేషన్లు లోడ్‌ చేశారు. అందులో కొన్ని అప్లికేషన్లు ప్రయోగాత్మకంగా పరిశీలించడం కోసం లోడ్‌ చేసినవి కాగా మరి కొన్ని కేవలం ఫన్‌ కోసం లోడ్‌ చేసినవి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం అంతరిక్షంలో భూ స్థిర కక్ష్యలోనే ఉంది. ‘స్ట్రాండ్‌ – 1’ అనే ఓ బుల్లి ఉపగ్రహంలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. పీఎస్‌ఎల్‌వీ సీ20 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఆరు విదేశీ ఉపగ్రహాలలో ఇది కూడా ఒకటి. యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేకి చెందిన సర్రే స్పేస్‌ సెంటర్‌ (ఎస్‌ఎస్‌సి) ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్షంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు గాను స్ట్రాండ్‌ – 1 నానో ఉపగ్రహాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. స్మార్ట్‌ఫోన్‌ అనుసంధానించబడిన ఈ ఉపగ్రహంలో లోడ్‌ చేసిన అప్లికేషన్లన్నీ గత ఏడాది ఫేస్‌బుక్‌ నిర్వహించిన పోటీలో విజేతలు రూపొందించిన అప్లికేషన్లు కావడం గమనార్హం. కక్ష్యలో ఉండగా స్మార్ట్‌ ఫోన్‌ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం తీవ్రత ఎలా ఉందనే విషయాన్ని ‘ఐటీసా’ అనే అప్లికేషన్‌ రికార్డు చేస్తుంది. అంతరిక్షంలో అయస్కాంత క్షేత్రాలపై మరిన్ని పరిశోధనలకు అది ఉపకరిస్తుంది. అత్యంత సూక్ష్మంగా ఉండే అయస్కాంత తరంగాలను కూడా ఈ అప్లికేషన్‌ గుర్తిస్తుంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ రూపొందించిన ‘స్క్రీమ్‌ ఇన్‌ స్పేస్‌’ అప్లికేషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ స్పీకర్లను గరిష్టంగా ఉపయోగించుకునేందుకు దోహదపడుతుంది. అంతరిక్షంలో వీడియోలను ప్లే చేయడంతో పాటు వాటి నుంచి వచ్చే శబ్ద తరంగాలను స్మార్ట్‌ ఫోన్‌లోని మైక్రో ఫోన్‌ రికార్డ్‌ చేసేందుకు ‘స్క్రీమ్‌ ఇన్‌ స్పేస్‌’ అప్లికేషన్‌ ఉపకరిస్తుంది. ‘స్ట్రాండ్‌ డేటా’ అప్లికేషన్‌ ఈ ఉపగ్రహంలో అదనపు కెమెరాలా ఉపకరిస్తుంది. ఉపగ్రహం పనిచేస్తున్న తీరును ఇది చిత్రీకరిస్తుంది. ‘ద 360’ అప్లికేషన్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలాగా పనిచేస్తుంది. స్ట్రాండ్‌ – 1 ఉపగ్రహం నుంచి భూమి ఫొటోలను తీసేందుకు ఈ అప్లికేషన్‌ ఉపకరిస్తుంది.

First Published:  23 Sept 2015 6:34 PM IST
Next Story