కోడి గుడ్డుమీద ఈకలు పీకడం అంటే ఇదే...
పశ్చిమబెంగాల్ విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ని ప్రభుత్వం తీసెయ్యదలచుకుంది. అదేదో డైరెక్ట్‌గా చెప్పేస్తే వెళ్ళిపోతాడు. లేకపోతే పోయేదాకా వేధిస్తాం. ఎలాగూ పోకతప్పదు మర్యాదగా వెళ్ళిపోండి అంటే సరిపోయేది. అలాకాకుండా వైస్‌ఛాన్సలర్ అధికారికంగా ఎవరికో పార్టీ ఇచ్చి మందు ఖర్చు కూడా యూనివర్శిటీ ఖర్చుల్లో రాసేశాడని పెద్ద అభియోగం మోపారు. మన నాయకులు ఇచ్చే పార్టీల్లో మందుకొనేది ప్రభుత్వఖర్చులతోనే కదా అని గుర్తొచ్చినట్లు లేదు. వేధించడానికి వేయి మార్గాల్లో ఇదొకటి కాబోలు! కొన్ని వారాలక్రితం సెతల్వాద్ నడుపుతున్న ఎన్‌జివో […]
పశ్చిమబెంగాల్ విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ని ప్రభుత్వం తీసెయ్యదలచుకుంది. అదేదో డైరెక్ట్‌గా చెప్పేస్తే వెళ్ళిపోతాడు. లేకపోతే పోయేదాకా వేధిస్తాం. ఎలాగూ పోకతప్పదు మర్యాదగా వెళ్ళిపోండి అంటే సరిపోయేది. అలాకాకుండా వైస్‌ఛాన్సలర్ అధికారికంగా ఎవరికో పార్టీ ఇచ్చి మందు ఖర్చు కూడా యూనివర్శిటీ ఖర్చుల్లో రాసేశాడని పెద్ద అభియోగం మోపారు. మన నాయకులు ఇచ్చే పార్టీల్లో మందుకొనేది ప్రభుత్వఖర్చులతోనే కదా అని గుర్తొచ్చినట్లు లేదు. వేధించడానికి వేయి మార్గాల్లో ఇదొకటి కాబోలు!
కొన్ని వారాలక్రితం సెతల్వాద్ నడుపుతున్న ఎన్‌జివో పెట్టిన ఖర్చుల మీద కూడా ఇలాగే ఈకలు పీకారు. చెవిలో గువిలి తీసుకునే పుల్లలను ఆమె ఎన్‌జివో డబ్బుతో కొనింది అని ఆరోపించారు. గుజరాత్ మారణకాండలో మోడీ మీద ఆమె కేసులు పెట్టకుండా ఉంటే ఇంత లోతైన పరిశోధన చేసేవాళ్ళు కాదేమో!