ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆంక్షలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించే సమావేశాలకు వెళ్ళాలనుకునే అధికారులకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ఎక్కువకాలం విజయవాడలోనే ఉంటున్నందున అధికారులు తరచూ అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఏలినవారి ఆదేశం కదాని ఎంత ఖర్చు పెట్టయినా వెళ్ళిపోవచ్చనుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆర్థికశాఖ కళ్ళెం వేసింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ మధ్య తిరిగే అధికారులు రానుపోను విమాన ఖర్చు పదివేలు దాటితే సొంత కారులో అయినా లేదా రైలులో ప్రయాణించి అయినా విజయవాడ చేరాలని షరతు విధించింది. ముఖ్యంగా […]
BY sarvi24 Sept 2015 7:46 AM IST
X
sarvi Updated On: 24 Sept 2015 7:46 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించే సమావేశాలకు వెళ్ళాలనుకునే అధికారులకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ఎక్కువకాలం విజయవాడలోనే ఉంటున్నందున అధికారులు తరచూ అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఏలినవారి ఆదేశం కదాని ఎంత ఖర్చు పెట్టయినా వెళ్ళిపోవచ్చనుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆర్థికశాఖ కళ్ళెం వేసింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ మధ్య తిరిగే అధికారులు రానుపోను విమాన ఖర్చు పదివేలు దాటితే సొంత కారులో అయినా లేదా రైలులో ప్రయాణించి అయినా విజయవాడ చేరాలని షరతు విధించింది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. విజయవాడ వచ్చిన తర్వాత స్టార్ హోటళ్ళలో బస చేయవద్దని, టూరిజం హోటళ్ళలోనే ఉండాలని కూడా మార్గదర్శనం చేసింది. అలాగే సీనియర్ అధికారులు వచ్చేటప్పుడు తమ వెంట ఎవరుబడితే వారిని తీసుకురావడం కుదరదని, ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇచ్చినవారిని మాత్రమే తోడ్కొని రావాలని షరతు విధించింది.
Next Story