Telugu Global
Others

మూతపడిన పత్రికల భూములు వెనక్కి!

మూతపడిన దినపత్రికల భూములను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములు పొందిన సంస్థలు 1994 నుంచి వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. దాంతో ఆయా సంస్థల యాజమాన్యాలకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 1994 నాటికే మూతపడిన ఉదయం, ఆంధ్ర పత్రిక, ది గార్డియన్ దిన పత్రికలకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలోగల హుడా లేఅవుట్‌లో భూములు కట్టబెట్టారు. ఒక్కో పత్రికకు రెండు ఎకరాల […]

మూతపడిన దినపత్రికల భూములను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములు పొందిన సంస్థలు 1994 నుంచి వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. దాంతో ఆయా సంస్థల యాజమాన్యాలకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 1994 నాటికే మూతపడిన ఉదయం, ఆంధ్ర పత్రిక, ది గార్డియన్ దిన పత్రికలకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలోగల హుడా లేఅవుట్‌లో భూములు కట్టబెట్టారు. ఒక్కో పత్రికకు రెండు ఎకరాల భూమిని కేటాయించారు. వీటిని తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
First Published:  23 Sept 2015 6:40 PM IST
Next Story