Telugu Global
Others

సెహభాష్‌ లోకేష్‌!

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని, పార్టీని శాసిస్తూ విమర్శల పాలవుతున్న లోకేష్‌ ఇటీవల ఒక మంచి నిర్ణయం తీసుకుని పార్టీ కార్యకర్తల చేత, రాజకీయ విమర్శకుల చేత సెహభాష్‌ అనిపించుకుంటున్నాడు. అదేమిటంటే, ఎన్నికల సమయంలో నీళ్ళున్న చేరువులోకి చేపలు వచ్చినట్టు గెలిచే అవకాశాలు ఉన్నచోటికి నాయకులు వలస వస్తుంటారు. వచ్చేవాళ్ళు ఒంటరిగా రారు. మందీ మార్బలంతో వస్తారు. తమకు, తమవాళ్ళకు టిక్కెట్స్‌ సంపాదించి, ఎన్నికల్లో గెలిచి ఇక తమ సామ్రాజ్యం స్థాపిస్తారు ఆయాజిల్లాల్లో. ఈ పరిణామంతో […]

సెహభాష్‌ లోకేష్‌!
X

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని, పార్టీని శాసిస్తూ విమర్శల పాలవుతున్న లోకేష్‌ ఇటీవల ఒక మంచి నిర్ణయం తీసుకుని పార్టీ కార్యకర్తల చేత, రాజకీయ విమర్శకుల చేత సెహభాష్‌ అనిపించుకుంటున్నాడు.

అదేమిటంటే, ఎన్నికల సమయంలో నీళ్ళున్న చేరువులోకి చేపలు వచ్చినట్టు గెలిచే అవకాశాలు ఉన్నచోటికి నాయకులు వలస వస్తుంటారు. వచ్చేవాళ్ళు ఒంటరిగా రారు. మందీ మార్బలంతో వస్తారు. తమకు, తమవాళ్ళకు టిక్కెట్స్‌ సంపాదించి, ఎన్నికల్లో గెలిచి ఇక తమ సామ్రాజ్యం స్థాపిస్తారు ఆయాజిల్లాల్లో. ఈ పరిణామంతో తీవ్రంగా నష్టపోయేది ఏళ్ళతరబడి పార్టీని నమ్ముకున్నవాళ్ళు. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటి క్యాడర్‌ ఉంది. ఇలా కొత్తగా పార్టీలోకి వచ్చేవాళ్ళ వల్ల ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నష్టపోతున్నారు. పార్టీలోకి కొత్తగా వలస వచ్చిన నాయకులు నామినేటెడ్‌ పోస్టులను తమ అనుచరులకు కట్టబెడుతూ ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను అవమానిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన లోకేష్‌ ఇకనుంచి వలస రాజకీయనాయకుల్ని కట్టడిచేసి, నామినేటెడ్‌ పోస్టులను ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు దక్కేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ నిర్ణయాన్ని పార్టీలోనూ, బయట అంతా మెచ్చుకుంటున్నారు. సెహభాష్‌ లోకేష్‌!

జగన్‌ ఎప్పుడు కళ్ళు తెరిచి ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

First Published:  24 Sept 2015 7:01 AM IST
Next Story