రేవంత్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
ఓటుకు నోటు కేసులో షరతులను ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేసేలా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. విచారణలో ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు కేసు గురించి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయవద్దంటూ విధించిన ఆంక్షలను రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఎల్బీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. […]
BY sarvi23 Sept 2015 6:37 PM IST
X
sarvi Updated On: 24 Sept 2015 5:00 AM IST
ఓటుకు నోటు కేసులో షరతులను ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేసేలా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. విచారణలో ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు కేసు గురించి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయవద్దంటూ విధించిన ఆంక్షలను రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఎల్బీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల హైకోర్టు బెయిల్ ఆంక్షలు సడలించిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి సీఎంపై విమర్శనాస్త్రాలతో చెలరేగిపోయారు. తనను చూసి సీఎం భయపడి చైనాకు పారిపోయాడని వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరు పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసేలా ఉందని, రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను దసరా సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.
Next Story