Telugu Global
NEWS

ఏపీలో హెల్మెట్ ఉంటేనే వాహన రిజిస్ట్రేషన్‌

హెల్మెట్ లేకుండా వాహనాల రిజిస్ట్రేషన్ చేయబోరని ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదాల్ని అరికట్టడానికి ఇక రవాణాశాఖ సమాయత్తమవుతుందని రవాణ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. నవంబర్ ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మొదటిసారి ప్రమాదానికి కారణమైన వ్యక్తికి మూడు నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తామని, రెండుసార్లు కన్నా ఎక్కువుగా ప్రమాదాలకు కారణమైతే పూర్తిగా లైసెన్స్‌ రద్దు చేస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. […]

ఏపీలో హెల్మెట్ ఉంటేనే వాహన రిజిస్ట్రేషన్‌
X
హెల్మెట్ లేకుండా వాహనాల రిజిస్ట్రేషన్ చేయబోరని ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదాల్ని అరికట్టడానికి ఇక రవాణాశాఖ సమాయత్తమవుతుందని రవాణ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. నవంబర్ ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మొదటిసారి ప్రమాదానికి కారణమైన వ్యక్తికి మూడు నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తామని, రెండుసార్లు కన్నా ఎక్కువుగా ప్రమాదాలకు కారణమైతే పూర్తిగా లైసెన్స్‌ రద్దు చేస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటి నుంచే లైసెన్స్‌ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. బైక్‌తోపాటే హెల్మెట్‌ విక్రయించాలని షోరూం నిర్వాహకులకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని ఆయన వివరించారు. బైక్‌తోపాటు హెల్మెట్‌ తీసుకోవాలన్న నిబంధన చెల్లదని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. హెల్మెట్‌ బయట ఎక్కడయినా కొనుక్కునే వెసులుబాటు వినియోగదారుడికి ఉండగా బైక్‌ కొన్న షోరూంలోనే హెల్మెట్‌ కొనాలన్న నిబంధనపై వినియోగదారులు కోర్టుకెక్కే అవకాశం లేకపోలేదు.
First Published:  24 Sept 2015 5:36 AM GMT
Next Story