Telugu Global
Others

నీటిసంఘాల ఎన్నికలపై గవర్నర్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు

సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ మిగిలిన రాజకీయపార్టీలకు మనుగడ లేకుండా చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందం సభ్యులు ఆయనకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.  తక్షణమే సాగు నీటి సంఘాల విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరును ఆక్షేపిస్తూ అనేక సాక్ష్యాధారాలను గవర్నర్‌ నరసింహన్‌కు వారు సమర్పించారు. ఈ బృందంలో ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి, […]

సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ మిగిలిన రాజకీయపార్టీలకు మనుగడ లేకుండా చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందం సభ్యులు ఆయనకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తక్షణమే సాగు నీటి సంఘాల విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరును ఆక్షేపిస్తూ అనేక సాక్ష్యాధారాలను గవర్నర్‌ నరసింహన్‌కు వారు సమర్పించారు. ఈ బృందంలో ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాసు కృష్ణారెడ్డి, చెంగల్రాయుడు తదితరులున్నారు.
First Published:  23 Sept 2015 6:42 PM IST
Next Story