Wonder World 35
క్షిపణులు కూడా నాశనం చేయలేని నౌక! ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన, ఖరీదైన ఇల్లు భారత బడా కోటీశ్వరుడు ముకేశ్ అంబానీదే. అయితే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన, ఖరీదైన నౌక ఎవరికున్నదో తెలుసా? రష్యా కోటీశ్వరుడు రోమన్ అబ్రామోవిచ్ వద్ద ఉంది. చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ ఆయన. ఇటీవలే ఈ నౌకలో ఆయన న్యూయార్క్ వెళ్లారు. ఈ నౌక ప్రత్యేకతలు తెలుసుకుని అమెరికన్ ప్రభుత్వమే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిందట. ఎందుకంటే ఈ నౌకలో క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంది. అంటే […]
క్షిపణులు కూడా నాశనం చేయలేని నౌక!
ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన, ఖరీదైన ఇల్లు భారత బడా కోటీశ్వరుడు ముకేశ్ అంబానీదే. అయితే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన, ఖరీదైన నౌక ఎవరికున్నదో తెలుసా? రష్యా కోటీశ్వరుడు రోమన్ అబ్రామోవిచ్ వద్ద ఉంది. చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ ఆయన. ఇటీవలే ఈ నౌకలో ఆయన న్యూయార్క్ వెళ్లారు. ఈ నౌక ప్రత్యేకతలు తెలుసుకుని అమెరికన్ ప్రభుత్వమే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిందట. ఎందుకంటే ఈ నౌకలో క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంది. అంటే క్షిపణులతో కూడా ఈ నౌకను ఏమీ చేయలేరన్నమాట. దీని విలువ 150 కోట్ల డాలర్లు. మన రూపాయలలో చెప్పుకోవాలంటే దాదాపు 8,250 కోట్లన్నమాట. ఈ నౌకలో ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. రెండు స్విమ్మింగ్‌పూల్స్, రెండు హెలిప్యాడ్లు, ఓ డిస్కోహాల్, 30 గదులు, ఓ సినిమా ధియేటర్ ఉన్నాయి. అంతేకాదు ఈ నౌకలో ఓ సబ్‌మెరైన్ కూడా ఉంది. నౌక నుంచి సబ్‌మెరైన్ ద్వారా సముద్ర లోతుల్లో విహరించవచ్చు. నౌక కేమైనా అనుకోని విపత్తు తలెత్తితే అందులోని వారు సబ్‌మెరైన్ ద్వారా సురక్షితంగా తప్పించుకునే వీలుంటుందన్నమాట. ఈ నౌకలోని గదులన్నీ అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. అనేక సదుపాయాలు ఈ గదుల్లో అందుబాటులో ఉంటాయి. ఇక అబ్రామోవిచ్ నివసించే మాస్టర్ సూట్ ఇంకా ప్రత్యేకమైనది. అందులో మరిన్ని సదుపాయాలున్నాయి. అంతేకాదు ఆ గదిని బుల్లెట్‌ప్రూఫ్ సామగ్రితో నిర్మించారు. కిటికీలు, తలుపులే కాదు మొత్తం గది అంతా ఓ బంకర్ కన్నా గట్టిదన్నమాట. ఇక దూరం నుంచే అధునాతన లెన్స్‌లతో ఫొటోలు తీసే పాపరాజీ ఫొటోగ్రాఫర్లకు కూడా అబ్రామోవిచ్ మాస్టర్‌సూట్ దుర్భేధ్యమైనది. ఈ గదికి అమర్చిన లేజర్ సిస్టమ్ వల్ల ఎక్కడ నుంచి ఫొటోలు తీసినా కెమెరాలేవీ పనిచేయవు. ఈ నౌక పొడవు 557 అడుగులు.