వెంకయ్యా ఎందుకీ 'వంక'య్య?
అంత్యప్రాసలు..అర్థంకాని యాసలు..మూడు బాసల కలగాపులగపు ప్రసంగ ప్రముఖుడు వెంకయ్యనాయుడు..తాను కేంద్రమంత్రినని అప్పుడప్పుడు మరిచిపోతుంటారు. ఆయన బీజేపి మంత్రో, టీడిపి మంత్రో ప్రజలకి అర్ధంకానంతగా ప్రజల్ని అయోమయంలో పడేస్తాడు. తాను ఆంధ్రావాడిని కాదని, కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లాననీ చెబుతుంటారు. కానీ కేంద్రమంత్రిగా తాను ఏ పథకం ప్రకటించినా, ఎవరిపై విమర్శలు ఎక్కుపెట్టినా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభిస్తారు. కేంద్రంలో భూసేకరణ చట్టాన్ని అడ్డుకుంటామని, ఒక్క అంగుళం కూడా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని సేకరించనివ్వమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. […]
అంత్యప్రాసలు..అర్థంకాని యాసలు..మూడు బాసల కలగాపులగపు ప్రసంగ ప్రముఖుడు వెంకయ్యనాయుడు..తాను కేంద్రమంత్రినని అప్పుడప్పుడు మరిచిపోతుంటారు. ఆయన బీజేపి మంత్రో, టీడిపి మంత్రో ప్రజలకి అర్ధంకానంతగా ప్రజల్ని అయోమయంలో పడేస్తాడు. తాను ఆంధ్రావాడిని కాదని, కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లాననీ చెబుతుంటారు. కానీ కేంద్రమంత్రిగా తాను ఏ పథకం ప్రకటించినా, ఎవరిపై విమర్శలు ఎక్కుపెట్టినా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభిస్తారు.
కేంద్రంలో భూసేకరణ చట్టాన్ని అడ్డుకుంటామని, ఒక్క అంగుళం కూడా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని సేకరించనివ్వమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయనకు కౌంటరిచ్చే తొందరలో వెంకయ్య వైఎస్ వంక చూశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ‘దేశంలో కాంగ్రెస్ అంతటి క్రూరమైన, పాపిష్టి పార్టీ మరొకటి లేదు. రైతుల నుంచి లక్షల ఎకరాలు దోచుకుని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోంది.
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పదేళ్లలో (2004-14) ఏకంగా 5,07,147 ఎకరాలు బలవంతంగా లాక్కుంది. అలాంటి పార్టీకి ప్రధాని మోదీని విమర్శించే హక్కు ఎంతమాత్రం లేదు’’ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. తన ప్రభుత్వం కోసం, ప్రధానిని ప్రసన్నం చేసుకోవడం కోసం, సాటి మంత్రులతో ప్రెస్ మీట్‌కొచ్చి తన పాండిత్యం ప్రదర్శించడం కోసం వెంకయ్య తపనపడడంలో తప్పులేదు. కానీ వైఎస్ పాలనా హయాంలోనే భూములు లాక్కున్నారని స్ఫురించే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆక్షేపణీయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా అన్యాయంగా సేకరించలేదని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెంకయ్యకు కౌంటరిచ్చారు.
ఆ నాయుడు సంగతి..ఈ నాయుడికి తెలియదా?
2004కు ముందు సమైక్యాంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్న చంద్రబాబు సర్కారు హయాంలో ప్రతిపాదనలు, కేటాయింపులు జరిగిన సెజ్‌లు, పారిశ్రామికవాడలు.. 2004 తరువాత వచ్చిన వైఎస్ హయాంలో ప్రారంభమయ్యాయి. అంటే వెంకయ్యనాయుడు చెబుతున్న భూములు లాక్కున్న వ్యవహారమంతా బాబు హయాంలోనే జరిగింది. ఉదాహరణకు కాకినాడ సెజ్‌కు కేటాయించిన 60 వేల ఎకరాలకు బాబు సర్కారే పచ్చజెండా ఊపింది. అయితే వైఎస్ హయాంలో ఈ భూములకు మరింత మెరుగైన పరిహారం ఇచ్చారంతే! ఈ లెక్కన ఈ భూములను ఎవరు సేకరించినట్టు? కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యకు తెలియదా?
చంద్రబాబునాయుడు ఆనాడు..నేడు రైతుల భూములే లక్ష్యంగా సాగిస్తున్న సమీకరణలు, సేకరణ కుట్రలు వెంకయ్యనాయుడుకు కళ్లకు కనిపించవా అని కాంగ్రెస్ నేతలు లాజిక్ తీస్తున్నారు. వైఎస్ హయాంలో బీడు, బంజరు భూములకు రైతులు ఊహించని ధర ఇచ్చి మొత్తం అరవై వేల ఎకరాలు సేకరిస్తే.. చంద్రబాబు హయాంలో పచ్చని పంటపొలాలు, మూడు పంటలు పండే భూములను డబ్బులివ్వకుండా బలవంతంగా లాక్కుంటున్నారని రైతులే రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు.
ఇక రాజధాని, ఎయిర్‌పోర్ట్, పోర్టు పేరుతో లక్షల ఎకరాలను బాబు సర్కారు సేకరిస్తోంది. అత్యంత సారవంతమైన పంట భూములను సమీకరణ, సేకరణ అంటూ లాక్కుంటున్న ఏపీ ప్రభుత్వం వెంకయ్యకు కనిపించకపోవడంలో వింత లేదు కానీ.. వైఎస్ వైపు చూడడమే ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.