Telugu Global
Others

లోకేష్ కి జేసి ఒక‌ లెక్కా..?

అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి ఆయనేమైనా చంద్రబాబా? దేశ విదేశాల్లో బిజిబిజీగా తిరిగే సీఎం చంద్రబాబు కూడా అవసరం, అవకాశం ఉంటే అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తారేమో కాని చినబాబు మాత్రం ఎంత బిజీగా లేకపోయినా అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. ఇస్తే తన స్థాయి తగ్గిపోతుందని భావిస్తారు. బహుశా అలాగే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చినబాబు వద్దకు వచ్చినప్పుడు ముందు అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతో కలవడం కుదరదన్నారట లోకేష్‌బాబు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పది సంవత్సరాలు మంత్రిగా […]

లోకేష్ కి జేసి ఒక‌ లెక్కా..?
X

అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి ఆయనేమైనా చంద్రబాబా? దేశ విదేశాల్లో బిజిబిజీగా తిరిగే సీఎం చంద్రబాబు కూడా అవసరం, అవకాశం ఉంటే అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తారేమో కాని చినబాబు మాత్రం ఎంత బిజీగా లేకపోయినా అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. ఇస్తే తన స్థాయి తగ్గిపోతుందని భావిస్తారు. బహుశా అలాగే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చినబాబు వద్దకు వచ్చినప్పుడు ముందు అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతో కలవడం కుదరదన్నారట లోకేష్‌బాబు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పది సంవత్సరాలు మంత్రిగా పని చేసిన జేసీ ఇది జీర్ణించుకోలేక పోతున్నారట. లోకేష్‌ బిజీగా ఉన్నారని, అపాయింట్‌మెంట్‌ తీసుకుని మరోసారి రమ్మని ఆయన అనుచరులు చెప్పడంతో జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇలాంటి అనుభవం జేసీకే కాదు చాలామంది మంత్రులకు, ఎమ్మేల్యేలకు కూడా ఎదురైంది. కాకపోతే జేసీ విషయం బయటకు వచ్చింది… మిగిలినవారు కిమ్మనకుండా ఉంటున్నారు. లోకేష్ ఏకంగా మంత్రివర్గ సమావేశాలే నిర్వహించడం, మంత్రుల పని తనానికి ప్రోగ్రెస్ కార్డులు తయారు చేయించడం లాంటివే మంత్రులు భరిస్తుంటే జేసి లాంటి ఎంపీ లోకేష్ కి ఒక లెక్కా అని అస్మదీయులు అంటున్నారు.

లోకేష్‌ బిజీగా ఉన్నట్టు చెబుతున్నా అసలు కారణం వేరే ఉందంటున్నారు తెలుగుదేశం వర్గీయులు. ఇటీవల జేసీ ప్రత్యేకహోదాపైన, చంద్రబాబు వైఖరిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జేసీకి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే లోకేష్‌ బాబు ఇలా చేశాడని అంటున్నారు. ఏదేమైనా అనంతపురం జిల్లాలోను, తాడిపత్రిలోను తిరుగులేని నాయకుడిగా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డికి ఇది నిజంగా అవమానమే! దీనిపై ఆయన మీడియా ముందు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే!

First Published:  23 Sept 2015 7:10 AM IST
Next Story