అబ్దుల్ కలాంకు అసెంబ్లీ ఘన నివాళి
మాజీ రాష్ట్రపతి, అంతరిక్ష మిసైల్ ఏపీజే అబ్దుల్ కలాం మరణానికి తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మాజీ రాష్ట్రపతి, భారత అంతరిక్ష శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి నివాళుర్పించే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెడుతూ ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడారు. హైదరాబాద్‌తో అబ్దుల్ కలాంకు విడదీయరాని అనుబంధం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డి.ఆర్.డి.ఏ.కు […]
BY sarvi23 Sept 2015 5:29 AM IST
X
sarvi Updated On: 23 Sept 2015 12:14 PM IST
మాజీ రాష్ట్రపతి, అంతరిక్ష మిసైల్ ఏపీజే అబ్దుల్ కలాం మరణానికి తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మాజీ రాష్ట్రపతి, భారత అంతరిక్ష శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి నివాళుర్పించే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెడుతూ ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడారు. హైదరాబాద్‌తో అబ్దుల్ కలాంకు విడదీయరాని అనుబంధం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డి.ఆర్.డి.ఏ.కు ఆయన పేరు పెట్టాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడమే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. దేశానికి ఎంతో ఘనమైన కీర్తిప్రతిష్టలు సాధించడంలో ఆయన ఎనలేని పాత్ర పోషించారని కేసీఆర్ అన్నారు. రక్షణ రంగానికి, దేశానికి ఆయన మరణం తీరని లోటు అని అన్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, అధ్యాపకునిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, జాతి ఆయనను చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందని ఆయన తెలిపారు. కలాం తన జీవితాన్ని దేశానికే అంకితం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. అణుపరీక్షల నిర్వహణలో ఆయన కీలక భూమిక పోషించారని, భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారని, 40కి పైగా విశ్వవిద్యాలయాల నుంచి పద్మశ్రీ అవార్డులు పొందడం అసాధారణ విషయమని, భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో భారతీయ జనతాపార్టీ ప్రధాన పాత్ర పోషించిందని బీజేపీ పక్ష నాయకులు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తెలిపారు. కలాం మరణం దేశ ప్రజలందరినీ ఎంతో బాధకు గురి చేసిందని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆయనను రాష్ట్రపతి చేయడంలో తమ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాలని… అన్నప్పుడు సభ్యులంతా వేలెత్తి చూపడంతో… నాలుక్కరుచుకుని… తెలంగాణలో పుట్టాలని, తెలుగు ప్రజల్లో ఒకరుగా పుట్టాలని అన్నారు. కలాం జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ సభ్యులన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 2004లో అసెంబ్లీలో ప్రసంగిస్తున్నప్పుడు తాను ఈ దేశంలో అసమానతలు, ఆశ్రితపక్షపాతం, పేదరికం, దుర్బలత్వం పోవాలంటే ఏం చేయాలని తాను ఓ ప్రశ్న వేశానని, ఇవన్నీ పోవడానికి విద్య ఒక్కటే పరిష్కారమని ఆయన సమాధానం చెప్పారని, దేశంలో అసమానతలు పోవాలంటే విద్య, విజ్ఞానం ఒక్కటే పరిష్కారమని, దీనిలో కీలక భూమిక పోషించాల్సింది ఉపాధ్యాయులేనని అన్నారని, చివరకు ఆయనకు ఇష్టమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ పాఠాలు బోధిస్తూ తుది శ్వాస విడవడం కలాం చేసుకున్న అదృష్టమని ఆయన అన్నారు. ఇంకా సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ, టీఆర్‌ఎస్ తదితర నాయకులు కూడా కలాం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి అకాల మృతిపట్ల శాసనసభ సంతాపం తెలిపింది. సభాపతి అనుమతితో సీఎం కేసీఆర్ కిష్టారెడ్డి మృతిపై సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు పార్టీ శాసనసభ్యులు తమ సంతాప సందేశాలను తెలుపుతూ సర్పంచ్‌గా, న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను ప్రస్తుతించారు.
Next Story