Telugu Global
Cinema & Entertainment

నేను క్షేమం... అందరికీ థాంక్యూ: లయ

తన క్షేమం కోరుకున్న అందరికీ కృతజ్ఞతలని, తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సినీ నటి లయ స్పష్టం చేసింది. లాస్‌ ఏంజిల్స్‌ నుంచి కాలిఫోర్నియా వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని, ఈ సందర్భంగా తాను గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని మీడియాలో వచ్చిన వార్తలకు వివరణ ఇచ్చిన లయ అలాంటిదేమీ లేదని తెలిపింది. తను బాగానే ఉన్నానని చెబుతూ ఓ వీడియో రికార్డు చేసి అప్‌లోడ్‌ చేసింది లయ. స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన […]

నేను క్షేమం... అందరికీ థాంక్యూ: లయ
X
తన క్షేమం కోరుకున్న అందరికీ కృతజ్ఞతలని, తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సినీ నటి లయ స్పష్టం చేసింది. లాస్‌ ఏంజిల్స్‌ నుంచి కాలిఫోర్నియా వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని, ఈ సందర్భంగా తాను గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని మీడియాలో వచ్చిన వార్తలకు వివరణ ఇచ్చిన లయ అలాంటిదేమీ లేదని తెలిపింది. తను బాగానే ఉన్నానని చెబుతూ ఓ వీడియో రికార్డు చేసి అప్‌లోడ్‌ చేసింది లయ. స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి లయ గ్లామర్‌ పాత్రల కన్నా క్యారెక్టర్‌ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఎన్నారై డాక్టర్‌ను పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఆమె కాలిఫోర్నియాలో స్థిరపడి పోయింది.

First Published:  23 Sept 2015 8:18 AM IST
Next Story