అజ్ఞాతంలో మాజీ మంత్రి!
మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీ అజ్ఞాతంలోకి వెళ్లారు. భార్యపై వేధింపులు, గృహహింస, హత్యాయత్నం తదితర తీవ్ర నేరాపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఢిల్లీ హై కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఆయన తన భార్య లిపికి మిత్రాను వేధించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆమె గర్భవతిగా ఉన్నపుడు సోమ్‌నాథ్ కుక్కలతో కరిపించినట్లుగా వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో తన అరెస్టు […]
BY sarvi23 Sept 2015 4:55 AM IST
X
sarvi Updated On: 23 Sept 2015 4:55 AM IST
మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీ అజ్ఞాతంలోకి వెళ్లారు. భార్యపై వేధింపులు, గృహహింస, హత్యాయత్నం తదితర తీవ్ర నేరాపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఢిల్లీ హై కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఆయన తన భార్య లిపికి మిత్రాను వేధించినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆమె గర్భవతిగా ఉన్నపుడు సోమ్‌నాథ్ కుక్కలతో కరిపించినట్లుగా వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో తన అరెస్టు ఖాయమైందని తెలుసుకున్న సోమ్‌నాథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి, సోదరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోమ్‌నాథ్ సుప్రీంను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story