Wonder World 34
కోరమీసాలే కొత్త ట్రెండ్! మీసాలు గడ్డాలు లేకుండా నున్నగా షేవ్ చేసుకోవడం బాలీవుడ్ హీరోల పద్ధతి. అనిల్‌కపూర్ వంటి ఎవరో ఒకరిద్దరు మినహా బాలీవుడ్ హీరోలందరిదీ ఇదే బాట. హాలీవుడ్‌లోనూ అంతే ఎవరూ మనకు మీసాలతో కనిపించరు. అయితే ఇపుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ హీరోలు ఏపుగా మీసాలు పెంచడమే కాదు వాటిని మెలితిప్పుతూ పోజులిస్తున్నారు. బాలీవుడ్ హీరోలతోపాటు క్రికెటర్లు, ముంబైలో పేరుమోసిన ఫ్యాషనిస్టులంతా ఇపుడు కోర మీసాల ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మీసాలు పెంచడం సులువే […]
కోరమీసాలే కొత్త ట్రెండ్!
మీసాలు గడ్డాలు లేకుండా నున్నగా షేవ్ చేసుకోవడం బాలీవుడ్ హీరోల పద్ధతి. అనిల్‌కపూర్ వంటి ఎవరో ఒకరిద్దరు మినహా బాలీవుడ్ హీరోలందరిదీ ఇదే బాట. హాలీవుడ్‌లోనూ అంతే ఎవరూ మనకు మీసాలతో కనిపించరు. అయితే ఇపుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ హీరోలు ఏపుగా మీసాలు పెంచడమే కాదు వాటిని మెలితిప్పుతూ పోజులిస్తున్నారు. బాలీవుడ్ హీరోలతోపాటు క్రికెటర్లు, ముంబైలో పేరుమోసిన ఫ్యాషనిస్టులంతా ఇపుడు కోర మీసాల ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మీసాలు పెంచడం సులువే కానీ వాటిని అందంగా మెయిన్‌టెయిన్ చేయడం చాలా కష్టమని అందరూ ఒప్పుకుంటారు. ముఖ్యంగా కోరమీసాలయితే చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరూ చూడకుండా సవరించుకోవలసి ఉంటుంది. ఎవరైనా చూస్తే వీడేంటి మనల్ని చూస్తూ మీసం మెలేస్తున్నాడు… అనుకుంటారు. ఎందుకంటే మీసం మెలేయడం సవాల్ చేయడానికి, నేను దేనికైనా రెడీ అని స్పష్టం చేయడానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఎవరూ చూడకుండా వాటిని సవరించుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ హీరోలలో ఈ ట్రెండ్ ‘మంగళ్‌పాండే’ సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ కోరమీసాలతో కనిపిస్తాడు. పాత్రోచితంగా ఉంటుందని ఆయన అలా మీసాలు పెంచాడు.
అది అలా కంటిన్యూ అయిపోతోంది. చాలామంది హీరోలు దీనిని ఫాలో అవుతున్నారు. అక్షయ్‌కుమార్, అజయ్‌దేవ్‌గన్, వివేక్ ఓబెరాయ్, సంజయ్‌దత్ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నవారిలో ఉన్నారు. కొత్తగా విడుదలకు సిద్ధమవుతున్న ‘రామ్ లీలా’లో కుర్ర హీరో రణ్‌వీర్ సింగ్ కూడా కోరమీసాలతో కనిపిస్తాడు. ఇక ఫ్యాషన్‌కు క్రీడలకు మధ్య విడదీయరాని సంబంధముంది. టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రంతోనే అదరగొట్టే రికార్డులను సొంతం చేసుకుని ఒక్కరోజులో స్టార్ క్రికెటర్ అయిపోయిన శిఖర్ ధావన్ కోరమీసాలతో హల్‌చల్ చేస్తున్నాడు. ఆడుతూనే పదేపదే మీసాలను సవరించుకుంటూ కనిపిస్తున్న శిఖర్ ధావన్ కొత్త ట్రెండ్ కుర్రకారును ఊపేస్తోంది.