ఉత్తమ్‌కు జైలు కూడు ఖాయం: తలసాని
ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో అప్పటి గృహనిర్మాణ శాఖ మంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవినీతి అందరికీ తెలిసిందేనని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన హౌసింగ్ స్కామ్‌లో చాలా మంది నాయకులకు సంబంధముందని, అందులో కీలకపాత్ర ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదేనని ఆరోపించారు. వారందరినీ అరెస్టు చేస్తే జైళ్లు కూడా సరిపోవన్నారు. హౌసింగ్ అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని […]
BY admin22 Sept 2015 2:29 AM IST
X
admin Updated On: 22 Sept 2015 2:30 AM IST
ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంలో అప్పటి గృహనిర్మాణ శాఖ మంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవినీతి అందరికీ తెలిసిందేనని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన హౌసింగ్ స్కామ్‌లో చాలా మంది నాయకులకు సంబంధముందని, అందులో కీలకపాత్ర ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదేనని ఆరోపించారు. వారందరినీ అరెస్టు చేస్తే జైళ్లు కూడా సరిపోవన్నారు. హౌసింగ్ అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జాప్యానికి కాంగ్రెసే కారణమన్నారు.
Next Story