ఏపీ 120 జీవోకి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 120 జీవోకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి భిన్నంగా ఉందంటూ దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయవద్దని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ జీవోను సవాలు చేస్తూ వైద్య విద్యను ఆశిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ నాగప్ప, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన బెంచ్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని ఈ జీవో దెబ్బతీస్తుందని […]
BY admin22 Sept 2015 10:37 AM IST
X
admin Updated On: 22 Sept 2015 10:38 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 120 జీవోకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి భిన్నంగా ఉందంటూ దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయవద్దని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ జీవోను సవాలు చేస్తూ వైద్య విద్యను ఆశిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ నాగప్ప, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన బెంచ్ 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని ఈ జీవో దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలతోనే తీర్పు ఇస్తే దాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఇపుడు సుప్రీం కూడా హైకోర్టు తీర్పుతోనే ఏకీభవిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జోనల్ విధానం నుంచి పద్మావతి మెడికల్ కాలేజీని మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం 120 జీవోను జారీ చేసింది. దీనివల్ల 120 సీట్లలో 85 శాతం సీట్లను పొందాల్సిన రాయలసీమ తన వాటాను నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని వైద్య విద్యను ఆశిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులు సవాలు చేయడంతో ఏపీ జీవోను సుప్రీం కొట్టేసింది. కాగా రాయలసీమ ప్రయోజనాలను కాలరాసే విధంగా జీవో తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ, సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండు చేశారు.
Next Story