Telugu Global
Cinema & Entertainment

రామ్‌గోపాల్‌వర్మ... మళ్ళీ వేసేశాడు

రామ్ గోపాల్ వర్మ… మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. గ్రామాల దత్తతపై ట్విట్టర్‌లో సీరియస్ ట్వీట్స్ చేశాడు. సినీ ఇండస్ట్రీ గ్రామాల దత్తతపై అడుగులు ముందుకేస్తుంటే… వర్మ మాత్రం వాళ్లపై హాట్ హాట్‌ కామెంట్స్ చేసి మళ్ళీ వార్తలకెక్కేశాడు. దత్తత పేరుతో గ్రామస్థుల్లో ఆత్మనూన్యత భావాన్ని పెంచుతున్నారని ఘాటుగా విమర్శించాడు. గ్రామలకు బదులు అమీర్‌పేటలో ఉన్న బస్తీలను దత్తత తీసుకోగలరా అని సవాల్ విసిరాడు. గ్రామాలను దత్తత తీసుకుని మన హీరోలు మహరాజుల్లా ఫీలైపోతుంటారని.. రాజరిక వ్యవస్థకు […]

రామ్‌గోపాల్‌వర్మ... మళ్ళీ వేసేశాడు
X
రామ్ గోపాల్ వర్మ… మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. గ్రామాల దత్తతపై ట్విట్టర్‌లో సీరియస్ ట్వీట్స్ చేశాడు. సినీ ఇండస్ట్రీ గ్రామాల దత్తతపై అడుగులు ముందుకేస్తుంటే… వర్మ మాత్రం వాళ్లపై హాట్ హాట్‌ కామెంట్స్ చేసి మళ్ళీ వార్తలకెక్కేశాడు. దత్తత పేరుతో గ్రామస్థుల్లో ఆత్మనూన్యత భావాన్ని పెంచుతున్నారని ఘాటుగా విమర్శించాడు. గ్రామలకు బదులు అమీర్‌పేటలో ఉన్న బస్తీలను దత్తత తీసుకోగలరా అని సవాల్ విసిరాడు. గ్రామాలను దత్తత తీసుకుని మన హీరోలు మహరాజుల్లా ఫీలైపోతుంటారని.. రాజరిక వ్యవస్థకు మరో రూపంగా ఈ తతంగాన్ని చూడొచ్చని వ్యాఖ్యానించాడు. గ్రామాల్లో సౌకర్యాల కంటే అక్కడే పేదరికం ఎక్కువన్న ఆయన… పల్లెల్లో పచ్చని చెట్లు.. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నాడు. ఇవేవీ లేని జీవితం బస్తీవాసులదన్నాడు. అయినా మన స్టార్స్‌కి బస్తీలను దత్తత తీసుకునేంత మంచి హృదయం లేదని తీవ్రస్థాయిలో విమర్శించాడు.
First Published:  22 Sept 2015 7:02 AM IST
Next Story