Telugu Global
NEWS

కల్తీ కల్లు పోయండి మహాప్రభో!

అబ్కారి దాడులు పెరగడంతో కల్తీ కల్లు దొరకక జనం పిచ్చి చేష్టలు చేస్తున్నారు తెలంగాణ జిల్లాల్లో డెంగు, స్వైన్ ఫ్లూ కు తోడు ఇప్పుడు కల్తీ కల్లు జనం ఉసురు తీస్తోంది. ప్రధానంగా మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీ కల్లు దొరకక అనారోగ్యం పాలయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాంతో ‘కల్తీ కల్లు సరఫరా చేయండి మహాప్రభో’ అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా వుందంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే […]

కల్తీ కల్లు పోయండి మహాప్రభో!
X

అబ్కారి దాడులు పెరగడంతో కల్తీ కల్లు దొరకక జనం పిచ్చి చేష్టలు చేస్తున్నారు తెలంగాణ జిల్లాల్లో డెంగు, స్వైన్ ఫ్లూ కు తోడు ఇప్పుడు కల్తీ కల్లు జనం ఉసురు తీస్తోంది. ప్రధానంగా మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీ కల్లు దొరకక అనారోగ్యం పాలయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాంతో ‘కల్తీ కల్లు సరఫరా చేయండి మహాప్రభో’ అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా వుందంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు పది మంది కల్తీ కల్లుకు బలయ్యారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో 400 కేసులు నమోదయ్యాయి. వసతి లేనందు వాళ్ళ కొంతమందిని పొరుగున వున్నా కర్నూలు ఆసుపత్రికి కూడా పంపారు. గడచినా రెండు వారాల్లో గుడుంబా, కల్తీకల్లు అమ్మకాలపై అబ్కారి దాడులు పెరగడంతో కల్తీ కల్లు దొరకక జనం పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కల్లుకు తెలంగాణ ప్రసిద్ధి. కొన్ని జిల్లాలలో కల్లు సమృద్ధిగా దొరకదు. అటువంటి చోట్ల డైజెఫాం, అల్ప్రజోలం కలిపిన కల్తీ కల్లు తాగి జనం సంతృప్తి చెందుతుంటారు. కల్తీ కల్లుకు బానిసైన వారిని మామూలు స్థితికి తేవడానికి కనీసం 10-15 రోజులు వైద్య సహాయం అందించాలి. అప్పటివరకు తక్కువ మోతాదులో రసాయనాలు కలసిన కల్లు సరఫరా చేయాలని కల్తీ కల్లు బాధితుల బంధువులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దాడులు ఆపి కల్తీ కల్లు సరఫరాకు చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి మరి.

First Published:  22 Sept 2015 4:40 PM IST
Next Story