Telugu Global
Cinema & Entertainment

పటాస్ దర్శకుడితో మెగా హీరో

పటాస్ తో మంచి విజయాన్నందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడీ దర్శకుడు నందమూరి కాంపౌండ్ నుంచి మెగా క్యాంప్ కు జంప్ అయ్యాడు. హీరో సాయిధర్మతేజతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు సుప్రీమ్ అనే టైటిల్ పెట్టారు. డోంట్ సౌండ్ హార్న్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చేనెల 5 నుంచి ఈ సినిమా […]

పటాస్ దర్శకుడితో మెగా హీరో
X
పటాస్ తో మంచి విజయాన్నందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడీ దర్శకుడు నందమూరి కాంపౌండ్ నుంచి మెగా క్యాంప్ కు జంప్ అయ్యాడు. హీరో సాయిధర్మతేజతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు సుప్రీమ్ అనే టైటిల్ పెట్టారు. డోంట్ సౌండ్ హార్న్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చేనెల 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. దిల్ రాజుతో సాయిధర్మతేజకు వరుసగా ఇది మూడో సినిమా కావడం విశేషం. గతంలో పిల్లా నువ్వులేని జీవితం సినిమా చేశాడు సాయిధర్మతేజ. తాజాగా విడుదలకు సిద్ధమైన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా కూడా దిల్ రాజుదే. ఇలా వరుసగా దిల్ రాజుతోనే సినిమాలు చేస్తున్నాడు ఈ మెగాహీరో.
First Published:  21 Sept 2015 8:30 PM
Next Story