జిన్నా పాత్ర పోషిస్తున్న ఒవైసీ: కేంద్రమంత్రి నజ్మా
దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీజిన్నా పాత్రను ప్రస్తుతం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోషిస్తున్నారని… కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా వ్యాఖ్యానించారు. అయితే దేశ విభజన కుట్రలను మరోసారి సాగనివ్వబోమని ఆమె హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీ మేధావుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావంపై ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. లాలూ, నితీష్, కాంగ్రెస్‌లు ఒక్కటైన వేళ ఈ త్రయం నుంచి […]
BY admin22 Sept 2015 6:05 AM IST
X
admin Updated On: 22 Sept 2015 6:22 AM IST
దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీజిన్నా పాత్రను ప్రస్తుతం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోషిస్తున్నారని… కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా వ్యాఖ్యానించారు. అయితే దేశ విభజన కుట్రలను మరోసారి సాగనివ్వబోమని ఆమె హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీ మేధావుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావంపై ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. లాలూ, నితీష్, కాంగ్రెస్‌లు ఒక్కటైన వేళ ఈ త్రయం నుంచి ముస్లిం మైనారిటీల ఓట్లు చీల్చాలంటే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలిసింది. తెలంగాణ నేతల అభిప్రాయాలను నజ్మా అధిష్టానానికి అందజేస్తారని తెలుస్తోంది.
Next Story