బాబు ముందా ప్రతిపక్షాల కుప్పిగంతులు..?
పట్టిసీమలో వందలకోట్ల అవినీతి జరిగిందని..పార్టీలకు అతీతంగా విపక్షాలన్నీ గొంతు చించుకుంటున్నాయి. అయితే రాయలసీమకు నీళ్లివ్వడం ఇష్టంలేని వాళ్ల కుట్రే ఇదంతా అని బాబు అండ్ గ్యాంగ్ తిప్పికొడుతోంది. లెక్కలు పట్టుకుని వచ్చినా తొక్కలో లెక్కలు ..లెక్క చేయమంటూ దూసుకుపోయింది. కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. లేని నీళ్లను ఇచ్చినట్టు భ్రమింపజేశారు. ఒక ఊరి పంపు, మరో ఊరు మోటారు ఎత్తుకొచ్చి..పట్టిసీమ ప్రారంభించి..దేశంలోనే నదుల అనుసంధానం చేశామని సింగపూర్ వెళ్లి మరీ డప్పుకొడుతున్నారు. అయితే పట్టిసీమలో జరిగిన […]
పట్టిసీమలో వందలకోట్ల అవినీతి జరిగిందని..పార్టీలకు అతీతంగా విపక్షాలన్నీ గొంతు చించుకుంటున్నాయి. అయితే రాయలసీమకు నీళ్లివ్వడం ఇష్టంలేని వాళ్ల కుట్రే ఇదంతా అని బాబు అండ్ గ్యాంగ్ తిప్పికొడుతోంది. లెక్కలు పట్టుకుని వచ్చినా తొక్కలో లెక్కలు ..లెక్క చేయమంటూ దూసుకుపోయింది. కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. లేని నీళ్లను ఇచ్చినట్టు భ్రమింపజేశారు. ఒక ఊరి పంపు, మరో ఊరు మోటారు ఎత్తుకొచ్చి..పట్టిసీమ ప్రారంభించి..దేశంలోనే నదుల అనుసంధానం చేశామని సింగపూర్ వెళ్లి మరీ డప్పుకొడుతున్నారు. అయితే పట్టిసీమలో జరిగిన అవినీతిపై ఉండవల్లి, జగన్, సీపీఎం, సీపీఐ కూడా ఇంకా గొంతు చించుకుంటూనే ఉన్నాయి. అవినీతి అక్రమాల నుంచి డిస్కషన్ ఇంకో వైపు మళ్లించేందుకు బాబు టీమ్ వేసిన ఎత్తుగడల్లో భాగమే ఈ అస్తవ్యస్త అంకితాలు. పైపులు ఎత్తుకు రావడాలు. మోటారు దొంగతనాలు అనేది బాబు వ్యూహం ఎరిగిన వారు చెబుతున్న మాట. వందల కోట్ల అవినీతి రోజూ గగ్గోలు పెట్టే నేతలు ఇప్పుడు ..ఏమీ లేకుండా అంకితం ఎలా చేశారని, గోదావరి నీళ్లు గోదావరిలో కలిపేసి నదుల అనుసంధానం అంటున్నారని, హంద్రీనీవా పైపు ఎత్తుకొచ్చారని, మోటారు పట్టిసీమది కాదని..రకరకాలు కొత్త అంశాల వైపు వెళ్లిపోయారు. పట్టిసీమ కాలువ గండి కూడా వీరి దృష్టిని మళ్లించేసింది. ఇప్పుడు పట్టిసీమ అవినీతిపై ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. అందరి దృష్టీ పంపు, మోటారు, గండిపైనే పడింది. బాబు గీసిన స్కెచ్ తెలియక విపక్షాలు బోల్తా పడ్డాయి. పట్టిసీమలో జరిగిన వందల కోట్ల అవినీతి ఆరోపణలకు అక్కడే ఒక మోటారు బిగించి..మరో పంపు రప్పించి.. ఒక 'గండి' కొట్టించి..ఎలా పక్కదారి పట్టించారో చూశారా? అందుకే బాబును మించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ నిపుణుడు ఇంకొకడు లేరనేది తెలుగు రాష్ర్టాలు ఎరిగిన సత్యం.