Telugu Global
Cinema & Entertainment

రోడ్డు ప్రమాదంలో హీరోయిన్‌ ల‌య‌!

‘స్వ‌యంవ‌రం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి తెలుగు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లయ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గుర‌వ్వ‌డంతో ఆమె ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. సోమ‌వారం ఆమె లాస్ ఏంజెల్స్‌కు వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాలీవుడ్‌లో ప‌లువురు అగ్ర హీరోల‌తో కూడా ఆమె నటించారు. 2006లో ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె ఆ […]

రోడ్డు ప్రమాదంలో హీరోయిన్‌ ల‌య‌!
X

‘స్వ‌యంవ‌రం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి తెలుగు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లయ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గుర‌వ్వ‌డంతో ఆమె ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. సోమ‌వారం ఆమె లాస్ ఏంజెల్స్‌కు వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాలీవుడ్‌లో ప‌లువురు అగ్ర హీరోల‌తో కూడా ఆమె నటించారు. 2006లో ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సెటిలైపోయారు. ల‌య‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఆమెకు చిన్న‌పాటి శ‌స్ర్త‌చికిత్స కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

First Published:  22 Sept 2015 10:01 AM IST
Next Story