టీటీడీపీకి బొమ్మరిల్లు ఫాదర్ బాబు
బొమ్మరిల్లు సినిమా గుర్తుందా? సూపర్‌డూపర్ హిట్ అయిన సినిమాలో హీరో సిద్ధార్ధ్ టీటీడీపీ అయితే.. తండ్రి ప్రకాశ్‌రాజ్ చంద్రబాబు పాత్రలతో కొందరు పోలుస్తున్నారు. అధినేత చంద్రబాబు మాట నెగ్గడం కోసం, ఆయన వ్యూహాలు అమలు చేయడం కోసం..టీటీడీపీ నేతలు యమ యాతన పడుతున్నారు. నాన్న నిన్ను గెలిపించడం కోసం 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్నా! ఇప్పటికీ ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్నా అని ఆవేదన వ్యక్తం చేస్తాడు హీరో సిద్ధార్ద్. […]
బొమ్మరిల్లు సినిమా గుర్తుందా? సూపర్‌డూపర్ హిట్ అయిన సినిమాలో హీరో సిద్ధార్ధ్ టీటీడీపీ అయితే.. తండ్రి ప్రకాశ్‌రాజ్ చంద్రబాబు పాత్రలతో కొందరు పోలుస్తున్నారు. అధినేత చంద్రబాబు మాట నెగ్గడం కోసం, ఆయన వ్యూహాలు అమలు చేయడం కోసం..టీటీడీపీ నేతలు యమ యాతన పడుతున్నారు. నాన్న నిన్ను గెలిపించడం కోసం 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్నా! ఇప్పటికీ ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్నా అని ఆవేదన వ్యక్తం చేస్తాడు హీరో సిద్ధార్ద్. సేమ్ టు సేమ్..చంద్రబాబును నేరుగా వేడుకోకపోయినా..ప్రైవేట్ సంభాషణల్లో టీటీడీపీ నేతలు ఇదే డైలాగ్ కొడుతున్నారట. టీటీడీపీ పగ్గాలతోపాటు తమ చేతులూ బాబు చేతిలోనే ఉన్నాయని..ఆయన మాట నెగ్గించేందుకు తామూ ఓడిపోతున్నామని వాపోతున్నారట.
తెలంగాణ తెలుగుదేశం చలో బెజవాడ
మన నీళ్లు, మన వనరులు, మన పాలన, మన ఉద్యోగాలు పేరుతో సాగిన తెలంగాణ పోరాటం చరిత్రలోనే ఓ చెరగని అధ్యాయం. తెలంగాణ కల సాకారమైంది. ఉద్యమపార్టీకి అందలం అందింది. తెరాస వెలుగులో తెలుగుదేశం రోజురోజుకూ మసకబారిపోతోంది. ఇదే సమయంలో టీటీడీపీని బలోపేతం చేసి.. పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధినేత బాబు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తెలంగాణ టీడీపీ నేతలకు ఏం కావాలి? ఎలా అయితే పార్టీ బలోపేతం అవుతుందనేది..క్షేత్రస్థాయి కేడర్‌ను, లీడర్లను అడక్కుండానే బొమ్మరిల్లు ఫాదర్‌లా అన్నీ తానే చేస్తుండడంతో టీటీడీపీ నేతలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీని కూడా వదిలేశారు. తాజాగా టీటీడీపీ సమావేశం బెజవాడలో నిర్వహించడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధాని, తెలంగాణ నడిగడ్డ అయిన హైదరాబాద్‌లో తెలంగాణ టీడీపీ సమావేశం జరపకుండా ఏపీ రాజధాని ప్రాంతమైన బెజవాడలో టీటీడీపీ సమావేశం పెట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇది కూడా టీఆర్ ఎస్ నేతలు టీటీడీపీపై దాడి చేసేందుకు ఒక అస్ర్తంగా ఉపయోగపడనుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆత్మగౌరవం అంటే ఇదేనా?
సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పాలనా హయాంలో సీఎంలు తరచూ ఢిల్లీ వెళ్లేవారు. అక్కడి నుంచే పాలన సాగుతోందనే ఆరోపణలు వినిపించేవి. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ పార్టీ స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదిగింది టీడీపీ. ఢిల్లీ పెత్తనంపై ఆగ్రహంతో ఏర్పడిన పార్టీ..ఇప్పుడు తెలంగాణ టీడీపీని ఆంధ్రా నుంచి ఆపరేట్ చేయడాన్ని ఎలా సమర్థిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ టీడీపీ సమావేశాన్ని బెజవాడలో ఏర్పాటు చేసి అక్కడికే సీనియర్ నేతలను రప్పించడంపై ఇదేనా బాబు ఆత్మగౌరవం అంటే..అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.