Telugu Global
Others

నకిలీ పాస్‌పోర్ట్‌ల ముఠా గుట్టురట్టు

నకిలీ పాస్‌పోర్టులతో జనాన్ని మోసం చేస్తున్న వంచకులు మరోసారి నగరంలో పట్టుబడ్డారు. వీరిపై కన్నేసి ఉంచిన పోలీసులకు మంగళవారంనాడు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో దొరికిపోయారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్నట్టు గమనించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పాస్‌పోర్టులు ఇస్తామని చెబుతూ 29 మంది నుంచి రూ. 11.20 లక్షలను వీరు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుంచి 19 నకిలీ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

First Published:  21 Sept 2015 6:52 PM IST
Next Story