కల్తీ కల్లు దొరకక నలుగురు మృతి
తెలంగాణ జిల్లాల్లో మత్తు మందు కలిపిన కల్తీ కల్లు దొరకక పలువురు మృత్యువాతకు గురవుతున్నారు. మెదక్ జిల్లాలో ఇద్దరు, మహబూబ్ననగర్, కరీంనగర్‌లో ఒక్కొక్కరు చొప్పున కల్తీ కల్లు దొరకక చనిపోయారు. కల్తీ కల్లుకు బానిసలైన వీరంతా మామూలు కల్లు తాగినా ఫలితం ఉండడం లేదు. దాంతో కొంతమంది మత్తు మందులు కలిపిన కల్లు దొరకక చనిపోతుంటే మరికొందరు నరాల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలో మత్తుమందు కలిసిన కల్లు దొరక్క […]
BY admin21 Sept 2015 6:36 PM IST
admin Updated On: 22 Sept 2015 11:08 AM IST
తెలంగాణ జిల్లాల్లో మత్తు మందు కలిపిన కల్తీ కల్లు దొరకక పలువురు మృత్యువాతకు గురవుతున్నారు. మెదక్ జిల్లాలో ఇద్దరు, మహబూబ్ననగర్, కరీంనగర్‌లో ఒక్కొక్కరు చొప్పున కల్తీ కల్లు దొరకక చనిపోయారు. కల్తీ కల్లుకు బానిసలైన వీరంతా మామూలు కల్లు తాగినా ఫలితం ఉండడం లేదు. దాంతో కొంతమంది మత్తు మందులు కలిపిన కల్లు దొరకక చనిపోతుంటే మరికొందరు నరాల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలో మత్తుమందు కలిసిన కల్లు దొరక్క రాములు (52) అనే వ్యక్తి చనిపోగా సదాశివపేట మండలం నందికంటిలో కల్తీ కల్లు దొరకలేదని పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాగే మహబూబ్‌నగర్ జిల్లా హాజీపల్లి రోడ్డులో ఓ మహిళ, కరీంనగర్ జిల్లా జగిత్యాల మహాలక్ష్మీనగర్‌లో మొయినుద్దీన్ అనే రిక్షా కార్మికుడు కల్లీ కల్లు దొరకక మృతి చెందారు.
Next Story