Telugu Global
Others

పట్టిసీమ కాలువకు అప్పుడే గండి..!

మూలిగే నక్కపై తాటికాయ పడ్డటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితి. ఇప్పటికే పలు విషయాలలో ఎన్నో ఆరోపణలు… అవమానాలకు గురవుతున్న బాబుకి మరొక ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న పట్టిసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించిన పోలవరం కుడి కాలువ అక్విడెక్ట్‌కు భారీ గండి పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన పోలవరం ప్రాజెక్టును ప్రక్కకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1100  కోట్లు ఖర్చవుతుందని […]

పట్టిసీమ కాలువకు అప్పుడే గండి..!
X
Pattiseeema-spillsమూలిగే నక్కపై తాటికాయ పడ్డటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితి. ఇప్పటికే పలు విషయాలలో ఎన్నో ఆరోపణలు… అవమానాలకు గురవుతున్న బాబుకి మరొక ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న పట్టిసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించిన పోలవరం కుడి కాలువ అక్విడెక్ట్‌కు భారీ గండి పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన పోలవరం ప్రాజెక్టును ప్రక్కకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు ప్రభుత్వానికి తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ. 1500 కోట్లు కేటాయించడంతో అనేక విమర్శలు వచ్చాయి. చంద్రబాబు కోటరికి 500 కోట్ల రూపాయలు ముడుపులందాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నట్లుగా ప్రాజెక్టు ప్రారంభమైన ఆనవాళ్ళు చెరిగిపోక ముందే కుడి కాలువకు గండి పడింది.
add-pattiseemaపట్టిసీమ ఎత్తిపోతల పధకం విషయంలో చంద్రబాబు ముందు నుంచి అనేక తప్పులు చేస్తున్నారు… తప్పటడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తవకుండానే జాతికి అంకితం చేసి ప్రజలలో నవ్వులపాలయ్యారు. అంతటితో ఆగకుండా ఈనెల పదహారున ప్రాజెక్టు వద్ద పనులు పూర్తవకపోయినా కొబ్బరికాయ కొట్టి దేశంలో ప్రప్రథమంగా నదుల అనుసంధానం చేసిన ఘనత తనదేనని ప్రచారం చేసుకున్నారు. తెలుగు తమ్ముళ్ళ ప్రచార పర్వం పూర్తవకుండానే ప్రాజెక్టు కుడి కాలువకి గండి పడటంతో కృష్ణా నదిలోకి నీరు చేరడం పోయి … కొల్లేరులోకి నీరు వృధాగా చేరుతుంది.
నారా బాబు….ప్రచారం డాబు!

Add-pattiseema-2చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా చేస్తున్న అన్ని పనులు కేవలం ప్రచారం కొసమే చేస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికిమొన్న మహా పుష్కరాలంటూ ప్రచారంపై పెట్టిన శ్రద్ధ…. ఏర్పాట్లపై పెట్టక పోవడంతో 29 మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ రోజేమో నదుల అనుసంధానమంటూ ప్రచారంపై పెట్టిన ఆసక్తిని ప్రాజెక్టు పనులపై పెట్టక పోవడంతో అనేక గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా చంద్రబాబు తనకు పబ్లిసిటీపై ఉన్న మోజును ప్రక్కకు పెట్టి …ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెడితే జనానికి మేలు జరుగుతుంది.

– సవరం నాగేశ్వరరావు
First Published:  20 Sept 2015 8:15 PM GMT
Next Story