Telugu Global
Others

గరుడసేవలో భక్తజనం పునీతం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ ఆద్యంతం రమణీయంగా, శోభాయమానంగా జరిగింది. భక్తజనం తనివితీరా బ్రహ్మాండ నాయకుడ్ని తిరువీధుల్లో చూసుకుని తరించిపోయారు. ఆదివారం రాత్రి 8 గంటలకే ప్రారంభమైన సేవను లక్షల సంఖ్యలో భక్తులు వర్షానికి వెరవకుండా వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం గరుడసేవ జరగడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 5 […]

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ ఆద్యంతం రమణీయంగా, శోభాయమానంగా జరిగింది. భక్తజనం తనివితీరా బ్రహ్మాండ నాయకుడ్ని తిరువీధుల్లో చూసుకుని తరించిపోయారు. ఆదివారం రాత్రి 8 గంటలకే ప్రారంభమైన సేవను లక్షల సంఖ్యలో భక్తులు వర్షానికి వెరవకుండా వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం గరుడసేవ జరగడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కుంభవృష్టి కురిసినప్పటికీ.. గరుడ సేవ ప్రారంభమయ్యేదాకా భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం కృష్ణస్వామి వెంటరాగా శ్రీవారు మోహినీ అవతారంలో మాడవీధుల్లో విహరించారు. బంగారు చిలుకను చేబూని, తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు మాలలను ధరించి దంతపల్లకిలో మాడవీధుల్లో ఊరేగారు.

First Published:  20 Sept 2015 6:36 PM IST
Next Story