Telugu Global
Others

టి-టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ షురూ

తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఇప్పటివరకు రేసులో ఉన్న ఎల్‌. రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి మాత్రమే ఉన్నారు. కాని కొత్తగా ఈ జాబితాలోకి ఇపుడు మోత్కుపల్లి కూడా చేరారు. దళితకార్డును ముందు పెట్టి మోత్కుపల్లి ఈ పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. అయితే గవర్నర్‌ గిరి ఎర వేసి ఉంచడంతో తన వాదనను ఎంత బలంగా వినిపిస్తారన్న అంశంపై సందేహాలున్నాయి. కాగా ఎర్రబెల్లి మాత్రం సైలెంట్‌గా ఉంటూ.. వ్యవహారాలను గమనిస్తూనే మధ్యమధ్యలో రేవంత్‌కు చురకలంటించినట్లు సమాచారం. ఇప్పటికే […]

టి-టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ షురూ
X
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఇప్పటివరకు రేసులో ఉన్న ఎల్‌. రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి మాత్రమే ఉన్నారు. కాని కొత్తగా ఈ జాబితాలోకి ఇపుడు మోత్కుపల్లి కూడా చేరారు. దళితకార్డును ముందు పెట్టి మోత్కుపల్లి ఈ పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. అయితే గవర్నర్‌ గిరి ఎర వేసి ఉంచడంతో తన వాదనను ఎంత బలంగా వినిపిస్తారన్న అంశంపై సందేహాలున్నాయి. కాగా ఎర్రబెల్లి మాత్రం సైలెంట్‌గా ఉంటూ.. వ్యవహారాలను గమనిస్తూనే మధ్యమధ్యలో రేవంత్‌కు చురకలంటించినట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు ఈ క్రియాశీలంగా ఉన్న ఎల్‌.రమణ మరోసారి ఈ పదవికి పోటీ పడుతున్నారు. తనకే అధ్యక్ష పట్టం కట్టాలని ఆయన అధినేతను అడగనున్నట్టు తెలిసింది. వీరి మధ్య నెలకొన్న పోటీ తీవ్రతను తగ్గించేందుకు అధినేత అనుసరిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిపై అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. తనకు నచ్చిన వారికి పదవి ఇచ్చుకునేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో 2 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారని ప్రకటించుకున్న టీడీపీ నేతలు.. అధ్యక్షుడి ఎంపిక కోసం కేవలం 200 నుంచి 250 మందికి మాత్రమే ఐవీఆర్‌ఎస్ ద్వారా సమాచారం అందించి నాయకులపై మీ అభిప్రాయం చెప్పాలని అడగడాన్ని ఎర్రబెల్లి ఇంట్లో జరిగిన ఓ సమావేశంలో నేతలు తప్పుబట్టినట్లు తెలిసింది. సమస్య ఓ కొలిక్కి రాకపోగా, మరింత జటిలమైనట్లు సమాచారం. పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో మరోమారు సమావేశం పెట్టుకుని చర్చిద్దామని నాయకులంతా ఎవరికి వారే లేచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత మిగిలిన వారు ఏపార్టీ దారి పట్టాలో ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ అధ్యక్ష పదవి పార్టీకి ఎంత బలమిస్తుందో తెలీదు కాని బలహీన పరిచే దారిలో మాత్రం కొంత క్లారిటీ ఇస్తోంది.
First Published:  20 Sept 2015 9:30 PM GMT
Next Story