దోమల్ని తరిమేద్దామిలా...!
దోమలు విజృంభించి డెంగ్యూ, మలెరియా లాంటి వ్యాధులను తెచ్చిపెడుతున్న కాలమిది. దోమలనుండి మనల్ని మనం రక్షించుకోవడం ద్వారా ఈ భయంకరమైన అనారోగ్యాలు రాకుండా నివారించవచ్చు. అందుకోసం పనికొచ్చే సులువైన చిట్కాలివి… -వేప, కొబ్బరి నూనెలను సమానపాళ్లలో తీసుకుని ఒంటికి రాసుకుంటే ఎనిమిది గంటలవరకు దోమలు కుట్టకుండా ఉంటాయి. -తలుపులు మూసేసి గదిలో ఇరవై నిముషాల పాటు కర్పూరం వెలిగిస్తే దోమలు పారిపోతాయి. -కిటికీ లేదా తలుపుకి చేరువలో తులసి మొక్కని ఉంచితే దోమల గుడ్లు పెరగకుండా ఉంటాయి, అలాగే దోమలు లోపలికి రావు. […]
దోమలు విజృంభించి డెంగ్యూ, మలెరియా లాంటి వ్యాధులను తెచ్చిపెడుతున్న కాలమిది. దోమలనుండి మనల్ని మనం రక్షించుకోవడం ద్వారా ఈ భయంకరమైన అనారోగ్యాలు రాకుండా నివారించవచ్చు. అందుకోసం పనికొచ్చే సులువైన చిట్కాలివి…
-వేప, కొబ్బరి నూనెలను సమానపాళ్లలో తీసుకుని ఒంటికి రాసుకుంటే ఎనిమిది గంటలవరకు దోమలు కుట్టకుండా ఉంటాయి.
-తలుపులు మూసేసి గదిలో ఇరవై నిముషాల పాటు కర్పూరం వెలిగిస్తే దోమలు పారిపోతాయి.
-కిటికీ లేదా తలుపుకి చేరువలో తులసి మొక్కని ఉంచితే దోమల గుడ్లు పెరగకుండా ఉంటాయి, అలాగే దోమలు లోపలికి రావు.
-వెల్లుల్లిపాయలను నీటిలో మరిగించి ఆ నీటిని గదిలో చల్లాలి. వాసన భరించే శక్తి ఉంటే ఒంటిపై కూడా చల్లుకోవచ్చు. ఆ వాసనకు దోమలు దరిచేరకుండా ఉంటాయి.
-లావెండర్ ఆయిల్ రూమ్ స్ప్రేని గదిలో చల్లినా లేదా రెండు మూడు చుక్కలు లావెండర్ ఆయిల్‌ని క్రీమ్‌లో కలిపి ఒంటికి రాసుకున్నా దోమలు దరిచేరవు. గదిలో మంచి సువాసనతో పాటు దోమలను తరిమేందుకు ఇది మంచి ఉపాయం.
-నిమ్మ, యూకలిప్టస్ నూనెలను సమాన పాళ్లలో తీసుకుని ఒంటికి రాసుకున్నా దోమలు కుట్టవు.
-పుదీనా వాసన దోమలకు పడదు. పుదీనా ఆకులను, వాటినుండి తీసిన రసాన్ని పలురకాలుగా వినియోగించుకుని దోమలను తరిమికొట్టవచ్చు. వేపరైజర్‌ని వినియోగించి పుదీనా వాసన ఇల్లంతా వ్యాపించేలా చేయవచ్చు. ఆయిల్‌ని శరీరానికి రాసుకోవచ్చు లేదా కిటికీ పక్కన పుదీనా మొక్క ఉన్న కుండీని ఉంచవచ్చు. ఇవన్నీ కాకపోతే పుదీనా వాసన ఉన్న మౌత్ వాష్‌ని నీళ్లలో కలిపి ఇల్లంతా చల్లవచ్చు.
-దోమలు మనం గాలిపీలుస్తున్న సమయంలో వదిలే కార్బన్‌డైఆక్సైడ్‌కి ఎక్కువగా ఆకర్షితమవుతాయి. డ్రై ఐస్, కార్బన్ డై ఆక్సైడ్ ని ఎక్కువగా విడుదల చేస్తుంది. కొన్ని డ్రై ఐస్ ముక్కలను ఒక డబ్బాలో వేసి మీరు తిరుగుతున్న ప్రదేశానికి కాస్త దూరంగా ఉంచండి. దోమలు ఆ డబ్బాలోకి చేరాక దాని మూత పెట్టేస్తే దోమల బెదడ ఉండదు. దీనికి కాస్త సమయం తీసుకున్నా ఇది బాగా పనిచేస్తుంది.
-కాఫీ చేశాక మిగిలిన పిప్పిని నిలవున్న నీరు, మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో వేస్తే చక్కని దోమల నివారిణిగా పనిచేస్తుంది. కాఫీపొడి కారణంగా లోపల ఉన్న దోమ గుడ్లు బయటకు వచ్చి ఆక్సిజన్ అందక నిర్వీర్యం అవుతాయి.
– శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు ధరించడం, ఇంట్లో నిలవనీరు, చుట్టుపక్కల మురుగునీరు లేకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.
-సూర్యుడు ఉదయించే సమయంలో, సాయంత్రం ఆస్తమించే సమయాల్లో దోమలు ఎక్కువగా సంచరిస్తాయి. ఈ సమయాల్లో ఆరుబయట జాగింగ్, వాకింగ్ చేసేవారు దోమలబారిన పడే అవకాశం మరింత ఎక్కువ. ఈ సమయాల్లో ఇండోర్ వ్యాయామాలు చేయడమే మేలు.
-ఒక గిన్నెలో బీర్‌ని పోసి ఒక మూల ఉంచినా దోమలు పారిపోతాయి.
-రోజ్‌మేరీ మొక్క కాడలను కాల్చినా ఆ వాసనకు దోమలు పారిపోతాయి. దోమ కుట్టినపుడు వచ్చే వాపు, నొప్పి తగ్గాలంటే… ఆ ప్రదేశంలో ఐస్‌ప్యాక్‌ని ఉంచాలి.
-టీ ట్రీ ఆయిల్‌ని పూయవచ్చు. అయితే ఇది అందరికీ పడదు. కొంచెం అప్లయి చేసి చూడాలి.
– ఒక చుక్క స్వచ్ఛమైన తేనెని దోమకుట్టిన ప్రాంతంలో వేసి తేనె శరీరంలో ఇంకేలా మర్దనా చేయాలి. బేకింగ్ సోడాలో నీటిని కలిపి ఆ ప్రదేశంలో రాయాలి. నలిపిన పుదీనా ఆకులతో ఆ ప్రాంతాన్ని రబ్ చేయాలి. అలోవేరా జెల్‌ని రాసినా నొప్పి, వాపు తగ్గిపోతాయి.
-అరటిపండు ముక్కని దోమ కుట్టిన చోట ఉంచినా నొప్పి తగ్గుతుంది.