Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 212

హెయిర్‌ సెలూన్‌ షాపులో క్రాపు చేస్తున్న అతన్తో కస్టమర్‌ ‘”దాదాపుగా నాది బట్టతల. కటింగ్‌కు 50 రూపాయలు చాలా ఎక్కువ’ అన్నాడు. కటింగ్‌ చేసే అతను మా శ్రమ కూడా మీరు చూడాలి సార్‌. తలలో వెతికి వెంట్రుకలు కనిపెట్టి కటింగ్‌ చెయ్యడమంటే అంత సులభమైన పనా? అన్నాడు. ————————————————————————— భర్త ఇంట్లోకొస్తూనే భార్య ఏడుస్తూ కనిపించింది. ‘ఏమైంది?’ అన్నాడు భర్త ఆదుర్దాగా. ‘మీకోసం పెట్టిన భోజనం పిల్లి తినేసిందండీ’ అంది బాధపడుతూ. ‘బాధపడకు! రేపు కొత్త […]

హెయిర్‌ సెలూన్‌ షాపులో క్రాపు చేస్తున్న అతన్తో కస్టమర్‌ ‘”దాదాపుగా నాది బట్టతల. కటింగ్‌కు 50 రూపాయలు చాలా ఎక్కువ’ అన్నాడు.
కటింగ్‌ చేసే అతను మా శ్రమ కూడా మీరు చూడాలి సార్‌. తలలో వెతికి వెంట్రుకలు కనిపెట్టి కటింగ్‌ చెయ్యడమంటే అంత సులభమైన పనా? అన్నాడు.
—————————————————————————
భర్త ఇంట్లోకొస్తూనే భార్య ఏడుస్తూ కనిపించింది.
‘ఏమైంది?’ అన్నాడు భర్త ఆదుర్దాగా.
‘మీకోసం పెట్టిన భోజనం పిల్లి తినేసిందండీ’ అంది బాధపడుతూ.
‘బాధపడకు! రేపు కొత్త పిల్లిని తెచ్చుకుందాంలే’ అన్నాడు తాపీగా.
—————————————————————————
ఒక అమ్మాయి బ్యాంకుకు వెళ్ళి డబ్బు విత్‌డ్రా చెయ్యాలనుకుంది.
‘మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చెయ్యగలరా?’ అన్నాడు క్లర్కు.
ఆ అమ్మాయి తాపీగా హ్యాండ్‌బ్యాగ్‌ తీసి అద్దంలో తల సర్దుకుని
‘ఆ నేనే! నన్ను నేను గుర్తు పట్టాను’ అంది!

First Published:  20 Sept 2015 6:33 PM IST
Next Story