దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్‌కు ప్రణాళిక
దేశవ్యాప్తంగా అన్ని రంగాలకూ 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. రానున్న ఐదేళ్ళలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి ప్రణాళికను తయారు చేసేందుకు ఓ అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ మరో 11 సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో కమిటీ విద్యుత్ సంబంధిత విషయాలను ఆధారం చేసుకుని ఒక్కో అంశంపై ప్రధాన కమిటీకి సూచనలు చేయనుంది. ఇందులో మొదటి సబ్‌కమిటీ.. నాణ్యమైన […]
BY admin20 Sept 2015 9:18 PM GMT
X
admin Updated On: 20 Sept 2015 11:21 PM GMT
దేశవ్యాప్తంగా అన్ని రంగాలకూ 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. రానున్న ఐదేళ్ళలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి ప్రణాళికను తయారు చేసేందుకు ఓ అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ మరో 11 సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో కమిటీ విద్యుత్ సంబంధిత విషయాలను ఆధారం చేసుకుని ఒక్కో అంశంపై ప్రధాన కమిటీకి సూచనలు చేయనుంది. ఇందులో మొదటి సబ్‌కమిటీ.. నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి, అందుకు తీసుకోవాల్సిన చర్యలు, తక్కువ ధరకే వినియోగదారులకు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సలహాలు ఇవ్వనుంది. విద్యుత్ డిమాండ్‌పై ఈ కమిటీ ఎప్పటికప్పుడు విశ్లేషణ కూడా జరుపుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇలా ఇతర కమిటీలు కూడా సంబంధిత విద్యుత్ అంశాలపై సలహాలివ్వనున్నట్లు వివరించింది.
Next Story