Telugu Global
Others

చంద్రబాబు, లోకేష్‌ మధ్యలో ఓ ఐఏఎస్‌

ఓ ఐఏఎస్‌ అధికారిపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే ఆయన పుత్ర రత్నం లోకేష్‌బాబు మాత్రం ఆయన పేరు చెబితే కారాలుమిరియాలు నూరతారు. ఎందుకంటే… ఎవరి కారణాలు వారికున్నాయి. పరిశ్రమల శాఖలో కమిషనర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రా ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తారని ప్రతీతి. ఆయన పనితీరు నచ్చి ఎన్నోసార్లు చంద్రబాబు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు తనతో విదేశీ పర్యటనల్లో కూడా తిప్పారు. కాని అదే ఐఏఎస్‌ అధికారి లోకేష్‌బాబుకు నచ్చడం లేదు. […]

చంద్రబాబు, లోకేష్‌ మధ్యలో ఓ ఐఏఎస్‌
X

ఓ ఐఏఎస్‌ అధికారిపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే ఆయన పుత్ర రత్నం లోకేష్‌బాబు మాత్రం ఆయన పేరు చెబితే కారాలుమిరియాలు నూరతారు. ఎందుకంటే… ఎవరి కారణాలు వారికున్నాయి. పరిశ్రమల శాఖలో కమిషనర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రా ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తారని ప్రతీతి. ఆయన పనితీరు నచ్చి ఎన్నోసార్లు చంద్రబాబు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు తనతో విదేశీ పర్యటనల్లో కూడా తిప్పారు. కాని అదే ఐఏఎస్‌ అధికారి లోకేష్‌బాబుకు నచ్చడం లేదు. ఎందుకంటే… ఆ మధ్య లోకేష్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈఓగా పని చేస్తున్న కొండయ్యను పరిశ్రమల శాఖలో ప్రత్యేక అధికారిగా నియమించారట! కాని తనకు మిశ్రా సహకరించడం లేదని, ఫోన్లు కూడా ఎత్తి సమాధానం చెప్పడం లేదని లోకేష్‌కు కొండయ్య ఫిర్యాదు చేశారు. దీంతో మిశ్రా భవిష్యత్‌ ఏమిటన్నదానిపై ఇపుడు చర్చ జరుగుతోంది. మిశ్రా విషయంలో బాబు మాట నెగ్గుతుందా? లోకేష్‌ చెప్పిందే చెల్లుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ!

First Published:  21 Sept 2015 9:27 AM IST
Next Story