Telugu Global
Others

బొగ్గు పాపం మన్మోహన్‌దే: దాసరి

బొగ్గు కుంభకోణంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కాంలో తనకెలాంటి సంబంధం లేదన్న దాసరి, అంతా మన్మోహనే చేశారంటూ బాంబు పేల్చారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అన్నీ ఆయనకు తెలుసని, గనుల కేటాయింపు మన్మోహన్ సమక్షంలో జరిగిందని తెలిపారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ కోర్టుకు హాజరైన దాసరి, కోల్ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదంటూ అఫిడవిట్ […]

బొగ్గు పాపం మన్మోహన్‌దే: దాసరి
X

బొగ్గు కుంభకోణంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కాంలో తనకెలాంటి సంబంధం లేదన్న దాసరి, అంతా మన్మోహనే చేశారంటూ బాంబు పేల్చారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అన్నీ ఆయనకు తెలుసని, గనుల కేటాయింపు మన్మోహన్ సమక్షంలో జరిగిందని తెలిపారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ కోర్టుకు హాజరైన దాసరి, కోల్ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్మోహన్ సింగ్… దాసరి వ్యాఖ్యలతో మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది?

First Published:  21 Sept 2015 12:39 PM
Next Story