Telugu Global
Cinema & Entertainment

సీనియ‌ర్స్ అంద‌రు డాను లే..!

వ్య‌వ‌స్థ‌కు  స‌మాంత‌రంగా  వ్య‌క్తి గ‌తంగా మ‌రో వ్య‌వ‌స్థ‌ను  రాజ్యాధికారినిబంధ‌న‌ల‌కు  వ్య‌తిరేకంగా న‌డ‌పే  వాళ్లే  మన సినిమా  డాన్స్.  ద‌ళ ప‌తి లో ముమ్ముటి   చేసిన రోల్ అటువంటింది. రామ్ గోపాల్ వ‌ర్మ  బిగ్ బి అమితాబ్ తో చేసిన  స‌ర్కార్ చిత్రం అదే. ఇలా ప్ర‌తి లాంగ్వేజ్ లోను పెద్ద హీరోలు  మ‌న‌సు దోచిన రోల్  డాన్.  తాజా గా    మ‌న ద‌క్షిణాది సీనియ‌ర్స్   …  సూప‌ర్ స్టార్స్   అంతా  డాన్ రోల్స్ కు సిద్దం అయ్యారు. […]

సీనియ‌ర్స్ అంద‌రు డాను లే..!
X

వ్య‌వ‌స్థ‌కు స‌మాంత‌రంగా వ్య‌క్తి గ‌తంగా మ‌రో వ్య‌వ‌స్థ‌ను రాజ్యాధికారినిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా న‌డ‌పే వాళ్లే మన సినిమా డాన్స్. ద‌ళ ప‌తి లో ముమ్ముటి చేసిన రోల్ అటువంటింది. రామ్ గోపాల్ వ‌ర్మ బిగ్ బి అమితాబ్ తో చేసిన స‌ర్కార్ చిత్రం అదే. ఇలా ప్ర‌తి లాంగ్వేజ్ లోను పెద్ద హీరోలు మ‌న‌సు దోచిన రోల్ డాన్. తాజా గా మ‌న ద‌క్షిణాది సీనియ‌ర్స్ … సూప‌ర్ స్టార్స్ అంతా డాన్ రోల్స్ కు సిద్దం అయ్యారు.

క‌బాలి అంటూ ర‌జ‌నీకాంత్ కొత్త ద‌ర్శ‌కుడి తో చేస్తున్న సినిమాలో డాన్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ని వినికిడి. అలాగే ఇక లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ చాల కాలం త‌రువాత డాన్ లాంటి రోల్ చేస్తున్నారు. చీక‌టి రాజ్యం చిత్రంలో క‌మ‌ల్ కూడా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక రోల్ క‌మ‌ల్ డాన్ గా చేస్తున్నార‌ని టాక్.

మ‌న తెలుగులో డిక్టేట‌ర్ పేరు తో బాల‌య్య చేస్తున్న చిత్రం.. బాల‌య్య కూడా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ సినిమాలో బాల‌య్య డాన్ త‌ర‌హా రోల్ ఒక‌టి వుంటుంద‌ని స‌మాచారం. మ‌రి ప్ర‌స్తుతం చిరంజీవి 150 వ సినిమాకు స్టోరి దొర‌క్క చాల ఇది అవుతున్నారు. ఏం చివ‌ర‌కు మెగాస్టార్ కూడా డాన్ స్టోరి చేస్తారేమో..! మొత్తం మీద సూప‌ర్ సీనియ‌ర్స్ .. గాడ్ ఫాద‌ర్. …డాన్ స్టోరిల్ని ప‌ట్టుకున్నారు. ఎలాగైన అభిమానుల్ని మెప్పించి హిట్ కొట్టాడానికి డాన్ మంచి ముడి స‌ర‌కు అని భావించిన‌ట్లున్నారు మ‌రి. రిజ‌ల్ట్ ఎవ‌రెవ‌రికి ఎలా వ‌స్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  21 Sept 2015 6:30 AM IST
Next Story