శ్రీవారి గరుడ సేవకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు చాలా కీలకమైనది. రాత్రి శ్రీవారు గరుడ వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగనున్నారు. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా శ్రీ వేంకటేశ్వరుని గరుడ సేవకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి గరుడసేవ ఈసారి ఆదివారం రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పర్వదినంగా భావించే గరుడసేవను వీక్షించడానికి భక్తజనం లక్షల్లో ఉంటారు. అందుకే ఈసారి రవాణా, భోజన ప్రసాదం పంపిణీలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. […]
BY sarvi19 Sept 2015 6:35 PM IST
sarvi Updated On: 21 Sept 2015 5:12 AM IST
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు చాలా కీలకమైనది. రాత్రి శ్రీవారు గరుడ వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగనున్నారు. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా శ్రీ వేంకటేశ్వరుని గరుడ సేవకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి గరుడసేవ ఈసారి ఆదివారం రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పర్వదినంగా భావించే గరుడసేవను వీక్షించడానికి భక్తజనం లక్షల్లో ఉంటారు. అందుకే ఈసారి రవాణా, భోజన ప్రసాదం పంపిణీలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మామూలుగా నడిచే బస్సులు కన్నా ఈసారి ఎక్కువ బస్సులు నడుపుతున్నారు. ఈ ఒక్కరోజు 512 ఆర్టీసీ బస్సులతో తిరుమలకు 3,500 ట్రిప్పులు ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్టు నడకదారి 24 గంటలూ తెరిచి ఉండేలా ఏర్పాటు చేశారు. అన్న ప్రసాద సముదాయంలో భక్తుల సౌకర్యార్థం ఎప్పటి మాదిరిగా కాకుండా బఫే విధానంలో భోజన ప్రసాదం ఏర్పాట్లు అమలులోకి తెచ్చారు. గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను టీటీడీ నిషేధించింది. 24 గంటలపాటు ఇది అమలులో ఉంచాలని నిర్ణయించారు.
Next Story