మోదీది ముమ్మాటికీ సూటుబూటు సర్కారే!
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం ముమ్మాటికీ సూటుబూటు సర్కారే అని విమర్శించారు. కార్పోరేట్ వర్గాలకు దొరికినంత సులువుగా సామాన్యులకు ప్రధాని దర్శనం దొరకదని ధ్వజమెత్తారు. ఆయనకు ఓటేస్తే.. ఉద్యోగాల మాట దేవుడెరుగు..ఉన్న భూములను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పశ్చిమ చంపారణ్‌లోని రాంనగర్‌లో కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. నేను చాయ్‌వాలాను అని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్న […]
BY sarvi20 Sept 2015 5:45 AM IST
X
sarvi Updated On: 20 Sept 2015 5:45 AM IST
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం ముమ్మాటికీ సూటుబూటు సర్కారే అని విమర్శించారు. కార్పోరేట్ వర్గాలకు దొరికినంత సులువుగా సామాన్యులకు ప్రధాని దర్శనం దొరకదని ధ్వజమెత్తారు. ఆయనకు ఓటేస్తే.. ఉద్యోగాల మాట దేవుడెరుగు..ఉన్న భూములను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పశ్చిమ చంపారణ్‌లోని రాంనగర్‌లో కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. నేను చాయ్‌వాలాను అని ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్న మోదీ గెలిచాక రూ.15 లక్షల సూట్లు ధరించడం మొదలు పెట్టారన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు మోదీ బద్ద వ్యతిరేకి అని ఆరోపించారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించలేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే నల్లధనం తెచ్చి ప్రతి భారతీయుడికి రూ.15 లక్షల చొప్పున పంచుతామన్న మాటలు ఇప్పుడు ఏమైపోయాయని నిలదీశారు. మహాత్మాగాంధీతోపాటు బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రాం, జవహర్‌లాల్ నెహ్రూ కూడా పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారు. కానీ బీజేపీ, ఆరెస్సెస్‌ది అందుకు విరుద్ధ వైఖరి. పేదలు, బలహీనవర్గాల ప్రజలు అజ్ఞానులని వారు భావిస్తారని మండిపడ్డారు. ఏ రాష్ర్టంలో ఎన్నికలు సమీపించినా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. అవీనీతిని నిర్మూలిస్తామన్న మోదీ సర్కారు మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం, రాజస్థాన్ సీఎం వసుంధరారాజే, విదేశాంగ మంత్రి సుష్మా-లలిత్‌మోదీ గేట్, చత్తీస్‌ఘడ్ పీడీఎస్ కుంభకోణం, మహారాష్ర్టలో పల్లిపట్టి కుంభకోణాలను ఎందుకు ఉపేక్షిస్తోందని ప్రశ్నించారు.
Next Story