మయూరి ఏక్ థమ్ పరఫెక్ట్..!
సినిమా చూస్తున్నంత సేపు భయ పెట్టే చిత్రాలు అభిమానులకు ఒక విందు భోజనం లాంటింది. ఆఫ్ కోర్స్ అందరు చూడలేరు కానీ.. ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి మయూరి లాంటి చిత్రం దమ్ బిర్యానీ కంటే ఎక్కువ అని చెప్పాలి. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ మంచి పాయింట్ ను పకడ్బంధీ స్క్రీన్ ప్లే తో ఇరగదీశాడు. టైటిల్స్ నుంచి .. సినిమా ఎండ్ వరకు భయ పెట్టే విధంగా […]
BY admin20 Sept 2015 2:30 AM IST
X
admin Updated On: 21 Sept 2015 6:09 AM IST
సినిమా చూస్తున్నంత సేపు భయ పెట్టే చిత్రాలు అభిమానులకు ఒక విందు భోజనం లాంటింది. ఆఫ్ కోర్స్ అందరు చూడలేరు కానీ.. ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి మయూరి లాంటి చిత్రం దమ్ బిర్యానీ కంటే ఎక్కువ అని చెప్పాలి. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ మంచి పాయింట్ ను పకడ్బంధీ స్క్రీన్ ప్లే తో ఇరగదీశాడు. టైటిల్స్ నుంచి .. సినిమా ఎండ్ వరకు భయ పెట్టే విధంగా మయూరి చిత్రాన్ని చేసి శభాష్ అనిపించుకున్నాడు. గుండె జబ్బులున్నవాళ్లు..ఈ సినిమాను చూస్తే చాల డేంజర్ . భయం మెయిన్ ఎలిమెంట్ గా చేసుకుని చాల మంది చిత్రాలు చే్స్తుంటారు. కానీ కొందరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు. అలా మయూరి చిత్ర దర్శకుడు సంగీతం, సినిమాటోగ్రఫి, ఆర్ట్ , ఆర్టిస్ట్ ల్ని వాడుకుని వందకు వంద శాతం అవుట్ పుట్ ఇచ్చాడు. పేరుకు నయనతార వున్నప్పటికి..కథలో తను అందర్భాగమే .. ఈ సినిమాకు కథే హీరో.. కథనమే బలం. మయూరి ఓవరాల్ గా టార్గెట్ ఆడియన్స్ కు కెవు కేక లాంటి ఫిల్మ్.
Next Story