Telugu Global
Others

మ‌గ‌వారి గురించి... కొన్ని క‌బుర్లు!

మగవారు మంచివారా కాదా అనేది పరీక్షించాలంటే వారి ఐక్యూని టెస్ట్ చేయమంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఎక్కువ ఐక్యూ ఉన్నవారు నమ్మదగిన వ్యక్తులయితే, ఐక్యూ తక్కువగా ఉన్నవారు అంతగా నమ్మకస్తులు కాదట. మగవారు ఆడవారిని కళ్లార్పకుండా చూడడం…కోసం తమ జీవితకాలంలో ఓ సంవత్సర కాలాన్ని వెచ్చిస్తున్నారట….విన‌డానికి ఫ‌న్నీగా అనిపించినా అధ్య‌య‌నాల్లో నిరూపిత‌మైన అంశాలివి. అలాంటి మ‌రికొన్ని అధ్య‌య‌నాల ఫ‌లితాలు, వాస్త‌వ అంశాల‌ను స‌మీక‌రించి ఇచ్చిన‌ స‌మాచారం ఇది. హ‌త్య‌ల‌కు గురయి మ‌ర‌ణిస్తున్న ఆడవారిలో స‌గం మంది త‌మ ప్ర‌స్తుత […]

మ‌గ‌వారి గురించి... కొన్ని క‌బుర్లు!
X

మగవారు మంచివారా కాదా అనేది పరీక్షించాలంటే వారి ఐక్యూని టెస్ట్ చేయమంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఎక్కువ ఐక్యూ ఉన్నవారు నమ్మదగిన వ్యక్తులయితే, ఐక్యూ తక్కువగా ఉన్నవారు అంతగా నమ్మకస్తులు కాదట. మగవారు ఆడవారిని కళ్లార్పకుండా చూడడం…కోసం తమ జీవితకాలంలో ఓ సంవత్సర కాలాన్ని వెచ్చిస్తున్నారట….విన‌డానికి ఫ‌న్నీగా అనిపించినా అధ్య‌య‌నాల్లో నిరూపిత‌మైన అంశాలివి. అలాంటి మ‌రికొన్ని అధ్య‌య‌నాల ఫ‌లితాలు, వాస్త‌వ అంశాల‌ను స‌మీక‌రించి ఇచ్చిన‌ స‌మాచారం ఇది.

  • హ‌త్య‌ల‌కు గురయి మ‌ర‌ణిస్తున్న ఆడవారిలో స‌గం మంది త‌మ ప్ర‌స్తుత జీవిత‌భాగ‌స్వామి లేదా మాజీ భ‌ర్త చేతుల్లో హతుల‌వుతున్నారు.
  • మ‌గ‌వారు స‌గ‌టున రోజుకి ఆరుసార్లు అబ‌ద్దాలు చెబుతారు…ఆడ‌వారు మూడుసార్లు మాత్ర‌మే చెబుతారు.
  • లాప్‌ట్యాప్‌ని ఒళ్లో పెట్టుకుని ప‌నిచేస్తున్న‌పుడు అది వేడిగా ఉంటే దాన్ని ప‌క్క‌న పెట్ట‌డం మంచిదంటున్నారు ప‌రిశోధ‌కులు. ఈ ప‌రిస్థితి మ‌గవారిలో సంతాన‌లేమికి కార‌ణం కావ‌చ్చున‌ట‌.
  • మ‌గ‌వారు త‌మ జీవిత‌కాలంలో ఆరునెల‌ల కాలాన్ని షేవింగ్ కోసం ఖ‌ర్చు చేస్తున్నారు.
  • త‌ల‌ని పూర్తిగా షేవ్ చేసుకుని ఎప్పుడూ గుండుతో క‌నిపించే మ‌గ‌వారు జుట్టుతో ఉన్న‌వారికంటే 13శాతం ఎక్కువ శ‌క్తి మంతులుగానూ, ఒక అంగుళం ఎక్కువ పొడ‌వున్న వారిగానూ క‌న‌బ‌డ‌తారు.
  • అంద‌మైన భార్య ఉన్న మ‌గ‌వారికి మిగిలిన‌వారికంటే జీవితం మ‌రింత‌ సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్టు అనిపిస్తుంద‌ట‌.
  • ఆడ‌వారు నిముషానికి 19సార్లు క‌ళ్ల‌ను ఆర్పుతారు…అదే మ‌గ‌వార‌యితే ప‌ద‌కొండు సార్లు మాత్ర‌మే క‌ళ్లను ఆర్పుతారు.
  • మొట్ట‌మొద‌ట హైహీల్స్ ని వాడింది మ‌గ‌వారే. ప‌దిహేడో శ‌తాబ్దంలోనే మ‌గ‌వారు వాటిని వాడ‌గా, మ‌గ‌వారిలా క‌నిపించాల‌నే ఉద్దేశంతో ఆడ‌వాళ్లు త‌రువాత కాలంలో వీటిని ధ‌రించ‌డం ప్రారంభించారు.
  • స‌గ‌టు మ‌హిళ‌కంటే స‌గ‌టు పురుషుడు నాలుగునుండి ఐదు అంగుళాల అద‌న‌పు పొడ‌వు ఉంటాడు.
  • ఇట‌లీలో 30-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సుండి, సింగిల్ గా ఉంటున్న మ‌గ‌వారిలో మూడోవంతు మంది వారి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి జీవిస్తున్నారు.
  • చైనాలో 2020నాటికి మూడునుండి నాలుగుకోట్ల‌మంది మ‌గ‌వారికి పెళ్లాడేందుకు అమ్మాయిలు దొర‌క‌ని ప‌రిస్థితి ఉంటుంది.
  • త‌న భార్య‌తో లేదా గ‌ర్ల్ ఫ్రెండ్‌తో న‌డుస్తున్న‌పుడు మ‌గ‌వాడు త‌న మామూలు న‌డ‌క‌స్థాయిని ఏడుశాతం త‌గ్గించి నిదానంగా న‌డుస్తాడు.
  • మ‌గ‌వారి మెద‌డు ఏక‌కాలంలో కుడిఎడ‌మ‌ల్లో ఒక‌వైపు మాత్ర‌మే ప‌నిచేస్తుంది. అదే ఆడ‌వారి మెద‌డు ఏక‌కాలంలో రెండువైపులా ప‌నిచేస్తుంది. అందుకే మ‌గ‌వారు ఒక స‌మ‌యంలో ఒక‌ప‌నిని మాత్ర‌మే చేస్తే, ఆడ‌వారు మ‌ల్టీ టాస్కింగ్ చేయ‌గ‌లుగుతారు.
  • అమెరికాలో ఏటా 450మంది మ‌గ‌వారు రొమ్ము క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణిస్తున్నారు.
  • మ‌గ‌వారు ఆడ‌వారికంటే త్వ‌ర‌గా ఐ ల‌వ్ యూ చెబుతారు.
  • ఉరుములు మెరుపులు వ‌చ్చిన‌పుడు ఆడ‌వారికంటే మ‌గ‌వారు ఐదురెట్లు ఎక్కువ‌గా భ‌యానికి గుర‌వుతారు.
  • ఆడ‌వాళ్ల‌ కంటే మ‌గ‌వాళ్లలో రెండు రెట్లు ఎక్కువ‌గా చెమ‌ట ప‌డుతుంది.
  • చాలాసార్లు ఆడ‌వారు చెబుతుంటే మ‌గ‌వారు ప‌ట్టించుకోకుండా అక్క‌డి నుండి వెళ్లిపోతుంటారు. ఆడ‌వారి న‌స భ‌రించాల్సిన ప‌నిలేద‌ని వారి ఉద్దేశం…. కానీ అస‌లు విష‌యం అది కాద‌ని సైన్స్ చెబుతోంది. ఆడ‌వారి గొంతులో మాట‌లు ప‌లుర‌కాల ఫ్రీక్వెన్సీల‌తో రావ‌డం వ‌ల‌న వాటిని అర్థం చేసుకునే శ‌క్తి మ‌గ‌వారి మెద‌ళ్ల‌కు ఉండ‌దట‌.

Also Read: మ‌హిళ‌ల గురించి కొన్ని సంగ‌తులు… స‌ర‌దాగా!

First Published:  20 Sept 2015 9:06 AM IST
Next Story